DishTV యూజర్లకు గుడ్ న్యూస్.. అన్‌లిమిటెడ్‌ FTA ఛానల్స్

DishTV (డీటీహెచ్) వినియోగదారులకు గుడ్ న్యూస్. డిష్ టీవీ ఆపరేటర్లు.. తమ వినియోగదారులకు బేస్ ప్యాక్ పై అందించే ఫ్రీ టూ ఎయిర్ (FTA) ఛానళ్లను అన్ లిమెటెడ్ గా అందిస్తున్నారు.

  • Published By: sreehari ,Published On : March 7, 2019 / 02:23 PM IST
DishTV యూజర్లకు గుడ్ న్యూస్.. అన్‌లిమిటెడ్‌ FTA ఛానల్స్

DishTV (డీటీహెచ్) వినియోగదారులకు గుడ్ న్యూస్. డిష్ టీవీ ఆపరేటర్లు.. తమ వినియోగదారులకు బేస్ ప్యాక్ పై అందించే ఫ్రీ టూ ఎయిర్ (FTA) ఛానళ్లను అన్ లిమెటెడ్ గా అందిస్తున్నారు.

DishTV (డీటీహెచ్) వినియోగదారులకు గుడ్ న్యూస్. డిష్ టీవీ ఆపరేటర్లు.. తమ వినియోగదారులకు బేస్ ప్యాక్ పై అందించే ఫ్రీ టూ ఎయిర్ (FTA) ఛానళ్లను అన్ లిమెటెడ్ గా అందిస్తున్నారు. ఈ ప్యాక్ కింద అందించే ఎఫ్ టీఏ ఛానళ్లు 100 ఛానళ్ల లోపు ఉంటే లెక్కలోకి రాదు. అంతేకాదు.. నెట్ వర్క్ కెపాసిటీ ఫీ (NCF) కూడా వర్తించదు. 

ట్రాయ్ నిబంధనల ప్రకారం.. డీటీహెచ్ ఆపరేటర్లు తమ వినియోగదారులకు బేస్ ప్యాక్ పై FTA (ఫ్రీ టూ ఎయిర్) 100 ఛానళ్ల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. TRAI సూచనలతో ఇప్పటివరకూ నెట్ వర్క్ కెపాసిటీ ఫీ (NCF) కింద (అన్ని ట్యాక్సులతో కలిపి) యూజర్లకు 100 ఛానళ్లు (రూ.130)తో అందిస్తున్నారు. ఇందులో GST 18శాతంతో కలిపి బేస్ ప్యాక్ ధర రూ.153 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

Paid ఛానల్ సెలెక్ట్ చేసుకున్నా..
DishTV తమ యూజర్ల కోసం కొత్త ప్యాక్ తీసుకోచ్చింది. అదే.. (MERA APNA PACK). ఈ ప్యాక్ కింద NCF ఫీ లేకుండా అన్ లిమిటెడ్ ఎఫ్ టీఏ ఛానళ్లను అందిస్తోంది. కొత్త ప్యాక్ లో యూజర్లు ఎలాంటి పేయిడ్ ఛానల్ అయిన సెలెక్ట్ చేసుకోవచ్చు. 

ట్రాయ్ సూచించినట్టుగా 25 వరకు డీడీ ఛానళ్లను ప్రతి ఒక్క డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్లు తమ వినియోగదారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రీ టూ ఎయిర్ ఛానళ్లు మాత్రం బేస్ ప్యాక్ లో ఎన్ సీఎఫ్ తో కలిపి ఇవ్వాల్సిందే. డీష్ టీవీ వినియోగదారులు ఎన్ సీఎఫ్ ఫీ కింద నెలకు (100 ఛానళ్ల వరకు) రూ.130 చెల్లించాలి. ఎఫ్ టీఏ ఛానళ్లతో కలిపి మొత్తం 100 ఛానళ్లలోపే ఉండాలి.

వీటిలో పెయిడ్ ఛానళ్లు కూడా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా వంద ఛానళ్లలోపే ఉండాలి. లేదంటే ఒక్కో ఛానల్ కు అదనంగా రూ.20 వరకు ఫీ చెల్లించాల్సి ఉంటుంది. FTA ఛానళ్లపై యూజర్లు అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, యూజర్లు 100 ఛానళ్ల స్లాట్ లో ఉంటే.. అన్ని ఎఫ్ టీఏ ఛానళ్లు, 25 డీడీ ఛానళ్లు ఎంచుకుంటే.. 25 వరకు సరిపోతాయి. మిగిలిన 75లో పెయిడ్ ఛానళ్లు ఎంచుకోవచ్చు.  
Also Read : ఆల్ ఇన్ వన్ : వాట్సాప్ తరహాలో ఫేస్ బుక్ ప్రైవసీ ప్లాట్ ఫాం