Diwali Deals
Diwali Deals : కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? దీపావళి సేల్ సందర్భంగా అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌లో పండుగ సీజన్ సేల్ ఇప్పుడు దీపావళికి ప్రత్యేక డీల్స్ అందిస్తోంది. ఈ-కామర్స్ కంపెనీ ప్రస్తుతం శాంసంగ్, టీసీఎల్, షావోమీ వంటి ప్రధాన బ్రాండ్‌ల నుంచి ఎల్ఈడీ స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపులను అందిస్తోంది.
విశేషమేమిటంటే.. ఈ స్మార్ట్ టీవీలు రూ. 6వేల కన్నా తక్కువ ప్రారంభ (Diwali Deals) ధరలతో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో అత్యంత సరసమైన స్మార్ట్ టీవీ డీల్స్ ఓసారి పరిశీలిద్దాం..
స్మార్ట్‌టీవీలపై టాప్ డిస్కౌంట్లు :
VW (విజియో వరల్డ్) :
లైనెక్స్ (Linux) ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అయ్యే ఈ 32-అంగుళాల ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ధర కేవలం రూ.5,999కు లభిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, యూట్యూబ్ వంటి పాపులర్ యాప్‌లతో ప్రీ ఇన్‌స్టాల్ అయి ఉంటుంది.
ఫిలిప్స్ :
మీరు ఫిలిప్స్ నుంచి 32-అంగుళాల QLED స్మార్ట్ టీవీని రూ.11,499కి కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ.22,999 నుంచి 50 శాతం ధర తగ్గింపు పొందవచ్చు. ఈ మోడల్ HD డిస్‌ప్లేను కలిగి ఉంది. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంది.
షావోమీ టీవీ A :
షావోమీ టీవీ A మోడల్ ధర రూ.11,999కి లభిస్తుంది. అసలు ధర రూ.24,999 నుంచి 52 శాతం తగ్గింపు పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ HD స్క్రీన్ కూడా కలిగి ఉంది. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతుంది.
టీసీఎల్ :
ప్రస్తుతం ఈ క్యూఎల్ఈడీ స్మార్ట్‌టీవీ రూ.13,990కు అందుబాటులో ఉంది. అసలు ధర రూ.22,999 నుంచి 39 శాతం తగ్గింపుతో లభిస్తోంది. ఇతర స్మార్ట్ టీవీల మాదిరిగానే HD డిస్‌ప్లేను కలిగి ఉంది. గూగుల్ టీవీలో రన్ అవుతుంది.
శాంసంగ్ :
దక్షిణ కొరియా కంపెనీ సరసమైన ఎల్ఈడీ స్మార్ట్‌టీవీ రూ.13,990కు అందిస్తోంది. లాంచ్ ధర రూ.17,900 కన్నా 22 శాతం తగ్గింపు అందిస్తోంది. ఈ మోడల్ HD స్క్రీన్ కలిగి ఉంది. ఎక్స్‌ట్రనల్ డివైజ్‌లను కనెక్ట్ చేసేందుకు HDMI, USB పోర్ట్‌ల వంటి అవసరమైన కనెక్టివిటీ ఆప్షన్లను కలిగి ఉంది.