×
Ad

Diwali Sale Scams : దీపావళి పండగ సేల్ డీల్స్.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో స్కామర్లతో జాగ్రత్త.. ఆన్‌లైన్‌ మోసాలకు ఇలా చెక్ పెట్టేయండి!

Diwali Sale Scams : పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు భారీగా పెరుగుతాయి. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో స్కామ్స్ ఎక్కువగా చేస్తుంటారు.

Diwali Sale Scams

Diwali Sale Scams : పండగ సేల్ సందడి కొనసాగుతోంది. దీపావళికి షాపింగ్ చేస్తున్నారా? ప్రతి వినియోగదారు కొత్త స్మార్ట్ ఫోన్ లేదా ఏదైనా హోం గాడ్జెట్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ పండుగ సీజన్‌లో షాపింగ్ కోసం ఎక్కువగా ప్రధాన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, కొన్ని థర్డ్-పార్టీ ఛానెల్స్ ద్వారా భారీగా అమ్మకాలు కొనసాగుతాయి. అయితే, కొన్ని రోజుల్లో దీపావళి పండగ రానుంది. మీరు ఆన్‌లైన్‌లో చేసే చిన్న తప్పును కూడా స్కామర్లు వదిలిపెట్టరు.

ఏదో రకంగా వినియోగదారులను (Diwali Sale Scams) ట్రాప్ చేసేందుకు అత్యంత సాధారణమైన స్కామ్‌లు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఇతర ప్లాట్ ఫాం వేదికగా మోసాలకు పాల్పడుతుంటారు. వినియోగదారులను నమ్మలేని విధంగా డిస్కౌంట్లను అందిస్తూ ట్రాప్‌లో పడేస్తారు. ఇలాంటి గుర్తుతెలియని స్కామర్ల నుంచి వచ్చే ఎలాంటి కాల్స్ లేదా మెసేజ్ అయినా అసలు రెస్పాండ్ అవ్వొద్దు. అవసరమైతే వెంటనే ఆ లింక్స్, మెసేజ్ డిలీట్ చేసేయండి.

ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో జరిగే స్కామ్‌లివే :
ఫేక్ దీపావళి డిస్కౌంట్లు :
ఈ పండగ సీజన్‌లో దీపావళి డిస్కౌంట్ స్కామ్.. స్కామర్లు వోచర్ డిస్కౌంట్లు లేదా దీపావళి స్పెషల్ ఫేక్ సేల్‌ను షేర్ చేస్తుంటారు. మీరు ఆయా లింక్‌పై క్లిక్ చేసినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి అలాంటి లిక్స్ మరో సైటుకు రీడైరెక్ట్ అవుతాయి. మీరు ఆ లింకుల ద్వారా అకౌంటులోకి లాగిన్ అయితే మీకు తెలియకుండానే మీ వ్యక్తిగత వివరాలను దొంగిలిస్తారు. తద్వారా మీ బ్యాంకు అకౌంటులో డబ్బులను కాజేస్తారు.

వాట్సాప్‌లో ఫిషింగ్ లింక్స్ :
ఇలాంటి స్కామ్‌లో హ్యాకర్లు ‘దీపావళి గిఫ్ట్ క్లెయిమ్ కోసం క్లిక్ చేయండి’ అనే బ్యానర్‌తో వాట్సాప్‌లో మెసేజ్‌లు లేదా ఫొటోలను షేర్ చేస్తారు. మీరు దానిపై ట్యాప్ చేసిన తర్వాత మీరు లాగిన్ వివరాలను తస్కరిస్తారు.మీ అకౌంట్ హ్యాక్ చేసి డబ్బులను కాజేస్తారు.

Read Also : Flipkart Diwali Sale 2025 : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ ఆఫర్లు.. ఐఫోన్ 16, శాంసంగ్ గెలాక్సీ S25, పిక్సెల్ 9 ఫోన్లపై స్టన్నింగ్ డీల్స్.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!

ఫ్రీ గిఫ్ట్స్ పేరుతో స్కామ్ :

మీ ఇన్‌స్టాగ్రామ్ లేదా వాట్సాప్‌లో స్కామర్లు కనెక్ట్ అయి ఫ్రీగా ఐఫోన్ 17 ప్రో మాక్స్ వంటి గిఫ్ట్స్ గెలుచుకున్నారని నమ్మిస్తారు. కానీ, ఆ ఐఫోన్ గెలుపొందాలంటే మీరు కొరియర్ ఛార్జీలను చెల్లించాలని చెబుతారు. ఇది మొత్తం స్కామ్ అని గమనించాలి. ఎందుకంటే.. మీరు ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత స్కామర్ల చేతుల్లోకి డబ్బు రాగానే చిన్నగా జారుకుంటారు.

దీపావళి ఈవెంట్స్, గిఫ్ట్ కార్డులతో మోసాలు :
దీపావళి సేల్ సమయంలో గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు అధికారులమని అకౌంట్ బ్లాక్ అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. వాస్తవానికి ఇలాంటివి స్కామ్ కావచ్చు. ఇలాంటి ఆఫర్లు, డిస్కౌంట్లు వచ్చినప్పుడు తొందరపడి లింక్ క్లిక్ చేసే కొనేందుకు ప్రయత్నించొద్దు.

చెక్ చేయకుండా అలానే పేమెంట్ చేస్తే మీరు చెల్లించిన మొత్తం డబ్బుతో పాటు అకౌంటులో డబ్బులు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే తెలియని నంబర్ నుంచి వచ్చిన దీపావళి గ్రీటింగ్ కార్డ్‌పై క్లిక్ చేస్తే ఇదే జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే మీ ఫోన్‌లో మాల్వేర్‌ ఆటో ఇన్‌స్టాల్ అయిపోతుంది జాగ్రత్త.

దీపావళి స్కామ్స్ నుంచి ఎలా సేఫ్‌గా ఉండాలి? :
ఈ పండగ సమయంలో ఆన్‌లైన్ స్కామ్‌లకు చాలా దూరంగా ఉండాలి. అందుకు మీరు చేయాల్సిందిల్లా ఒకటే.. గుర్తుతెలియని నంబర్ నుంచి ఎలాంటి లింక్స్, మెసేజ్ కాల్స్ ఆన్సర్ చేయొద్దు. మీకు అందించే ఆఫర్లు, డిస్కౌంట్లను ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి.

దీపావళి ఈవెంట్ లేదా స్మార్ట్‌ఫోన్ డీల్ నిజమైనదా కాదా చెక్ చేయడం ఎంతైనా మంచిది. అంతేకాకుండా, గుర్తుతెలియని సోర్సెస్ నుంచి వచ్చే లింక్‌లను నేరుగా క్లిక్ చేయొద్దు. ఎందుకంటే.. ఆయా లింక్స్ ఏదైనా డేంజరస్ మాల్‌వేర్ ఫైల్ కావచ్చు. లేదంటే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.