EPFO Pension : దీపావళికి ముందు PF ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్.. ఇకపై నెలకు రూ.7,500 పెన్షన్..? ఎప్పటినుంచో తెలుసా?

EPFO Pension : పెన్షన్ స్కీమ్ కింద కనీస పెన్షన్‌ రూ.1,000 నుంచి రూ.2,500కి పెంచే ప్రతిపాదనను EPFO సీబీటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

EPFO Pension : దీపావళికి ముందు PF ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్.. ఇకపై నెలకు రూ.7,500 పెన్షన్..? ఎప్పటినుంచో తెలుసా?

EPFO Pension

Updated On : October 7, 2025 / 1:37 PM IST

EPFO Pension : పీఎఫ్ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్.. 11 ఏళ్ల తర్వాత భారీగా పెన్షన్ పెరగబోతుంది. దీపావళికి ముందే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) శుభవార్త అందించనుంది. ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) అక్టోబర్ 10, 11 తేదీలలో బెంగళూరులో సమావేశం కానుంది. నివేదికల ప్రకారం.. ప్రస్తుతం కనీస పెన్షన్‌ నెలకు రూ. 1,000 నుంచి రూ. 2,500కు పెంచే ప్రతిపాదనపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

11 ఏళ్ల తర్వాత పెరగనున్న కనీస పెన్షన్ :
ఈపీఎఫ్ఓ కింద ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS-95) కనీస పెన్షన్ (EPFO Pension) ప్రస్తుతం నెలకు రూ. 1,000గా ఉంది. 2014లో ఈ పెన్షన్ మొత్తాన్ని నిర్ణయించారు. అప్పటి నుంచి 11 సంవత్సరాలుగా ఇంతవరకు పెన్షన్ మొత్తం మారలేదు. ప్రస్తుత ద్రవ్యోల్బణం దృష్ట్యా రూ.1,000 పెన్షన్ చాలా తక్కువగా ఉందని ఉద్యోగి సంస్థలు అంటున్నాయి.

ఉద్యోగి పెన్షన్ పథకం (EPS) కింద పెన్షన్ మొత్తాన్ని రూ.7,500కి పెంచాలని ట్రేడ్ యూనియన్లు, పెన్షనర్ల వివిధ సంఘాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే, సీబీటీ పెన్షన్‌ను 7.5 రెట్లు పెంచకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. దానికి బదులుగా రూ. 1000 నుంచి రూ.2,500కి పెన్షన్ పెంచే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.

ఈపీఎఫ్ఓ పెన్షన్ ఎలా నిర్ణయిస్తుందంటే? :
ఈపీఎస్ (EPS) కింద పెన్షన్ ఒక ఫిక్స్‌డ్ ఫార్ములా ఉపయోగించి లెక్కిస్తారు.
పెన్షన్ = (పెన్షన్ జీతం × పెన్షన్ సర్వీస్) ÷ 70

పెన్షన్ పొందే జీతం అంటే..
గత 60 నెలల సర్వీస్‌లో సగటు ప్రాథమిక జీతం + డీఏ, రూ. 15వేలకు పరిమితం.

Read Also : Vivo V50 5G : వివో లవర్స్ డోంట్ మిస్.. ఈ వివో V50 5G అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

పెన్షన్ పొందే సర్వీస్ అంటే..
మొత్తం సర్వీస్ సంవత్సరాలు 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు.

పెన్షన్‌ అర్హత కోసం కనీసం 10 ఏళ్ల సర్వీస్ ఉండాలి. మొత్తం పెన్షన్ పొందే జీతం గరిష్ట పరిమితి నెలకు రూ. 15వేలు.. అంటే ఒక సభ్యుడు 35 ఏళ్లు సర్వీసు చేసి ఉంటే అతను లేదా ఆమె నెలకు దాదాపు రూ. 7,500 పెన్షన్ పొందవచ్చు.

పెన్షన్ అర్హతలివే :

ఈపీఎష్ కింద పెన్షన్ కనీసం 10 ఏళ్లు కంటిన్యూ సర్వీసు ఉండాలి.
58 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత రెగ్యులర్ పెన్షన్ పొందేందుకు అర్హులు.
ఈ తేదీకి ముందే ఒక సభ్యుడు ఉద్యోగం మానిస్తే వారికి విత్‌డ్రా బెనిఫిట్స్ లేదా పెన్షన్ తగ్గుతుంది

ఈపీఎఫ్ఓ 3.0 సభ్యులు ఏం ఆశించవచ్చు? :
ఈ సమావేశంలో మరో ప్రధాన అజెండా ఈపీఎఫ్ఓ ​​3.0 ప్రాజెక్ట్. ఈపీఎఫ్ఓ ​​3.0 కింద సంస్థను పూర్తిగా డిజిటల్, పేపర్ లెస్ మార్చనున్నారు. ఇందులో ఏటీఎం నుంచి నేరుగా పీఎఫ్ విత్‌డ్రా, యూపీఐ ద్వారా ఇన్‌స్టంట్ పీఎఫ్ విత్‌డ్రా, రియల్-టైమ్ క్లెయిమ్ సెటిల్మెంట్, కరెక్షన్ ఫెసిలిటీ, డెత్ క్లెయిమ్‌లను ఆన్‌లైన్‌లో ఈజీగా పరిష్కరించడం, ఆటోమేటిక్ డేటా ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లు ఉంటాయి.

ఈ కొత్త టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ కోసం ఇన్ఫోసిస్, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వంటి భారతీయ ఐటీ సంస్థలకు బాధ్యతలను అప్పగించారు. టెక్నికల్ టెస్టింగ్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ సవాళ్లతో ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాదిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

సమావేశంలో నిర్ణయాలపై ఉత్కంఠ :
కనీస పెన్షన్ పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకోవడంతో పాటు డిజిటల్ సంస్కరణలు, పెట్టుబడి విధానం, పెన్షన్ పథకం ఫండ్ నిర్మాణం గురించి కూడా బోర్డు చర్చించవచ్చు. ఏదిఏమైనా తుది నిర్ణయానికి ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. అయినప్పటికీ, ఈ సమావేశంలో నిర్ణయాలతోనే లక్షలాది మంది పెన్షనర్లు, పీఎఫ్ ఖాతాదారుల భవిష్యత్తు ఆధారపడి ఉంది.

భారీ అంచనాలివే :
ఉద్యోగ సంఘాల ప్రకారం.. కనీస పెన్షన్ రూ. 1,000 ఏమాత్రం సరిపోదు. “ఇంత తక్కువ పెన్షన్‌తో బతకడం కష్టం. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచాలి” అని కార్మిక సంఘం ప్రతినిధి ఒకరు అన్నారు. అక్టోబర్ 10, 11 తేదీలలో జరిగే సీబీటీ సమావేశంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ సమావేశంలో పీఎఫ్ సభ్యులకు బిగ్ రిలీఫ్ దక్కుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు.