రాకెట్‌లా దూసుకుపోతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీగా పెరిగి, రికార్డు స్థాయికి..

విజయవాడలో కిలో వెండి ధర ఇవాళ ఉదయం రూ.100 పెరిగి రూ.1,67,100కి చేరింది.

రాకెట్‌లా దూసుకుపోతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీగా పెరిగి, రికార్డు స్థాయికి..

Updated On : October 7, 2025 / 11:34 AM IST

Gold Rates: ఓ వైపు ధనత్రయోదశి-దీపావళి సమీపిస్తున్న వేళ ప్రజలు బంగారం కొనడానికి ఆసక్తి చూపుతోంటే, మరోవైపు బంగారం ధరలు వరుసగా పెరిగిపోతూ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. 2025లో, ఈ కొనుగోళ్లు 80 మెట్రిక్ టన్నుల వరకు చేరవచ్చని అంచనా. ఇది బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం. (Gold Rates)

అలాగే, అమెరికా డాలర్ బలహీనపడటం వల్ల ఇతర దేశాల పెట్టుబడిదారులకు బంగారం కొనుగోలు చేయడం సులభం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు పెరిగాయి. భారతదేశంలో దీపావళి వంటి పండుగల సమయంలో బంగారం డిమాండ్ పెరుగుతుంది.

Also Read: గుడ్‌న్యూస్‌.. ఆలోపు భారీగా జీతాల పెంపు.. ఎంతెంత? ఎవరెవరికి ప్రయోజనం?

ప్రధాన నగరాల్లో ధరలు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,250 పెరిగి, రూ.1,22,020కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరిగి రూ.1,11,850కి చేరింది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,150 పెరిగి 1,22,070గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,150 పెరిగి 1,12,000కి చేరింది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,250 పెరిగి, రూ.1,22,020కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరిగి రూ.1,11,850కి చేరింది.

వెండి ధరలు

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర ఇవాళ ఉదయం రూ.100 పెరిగి రూ.1,67,100కి చేరింది.
  • విజయవాడలో కిలో వెండి ధర ఇవాళ ఉదయం రూ.100 పెరిగి రూ.1,67,100కి చేరింది.
  • విశాఖలో కూడా కిలో వెండి ధర ఇవాళ ఉదయం రూ.100 పెరిగి రూ.1,67,100కి చేరింది.
  • ఢిల్లీలో కిలో వెండి ధర ఇవాళ ఉదయం రూ.1,000 పెరిగి రూ.1,57,000కి చేరింది.
  • ముంబైలో కిలో వెండి ధర ఇవాళ ఉదయం రూ.1,000 పెరిగి రూ.1,57,000కి చేరింది.

Note: పసిడి కొనేవేళ స్థానిక దుకాణాల్లో మేకింగ్ చార్జీలు, హాల్‌మార్క్ వివరాలను పరిశీలించాలి. వాటి ఆధారంగా తుది ధరల్లో తేడాలు వస్తాయి.