TVS Raider : అడ్వాన్స్ టెక్నాలజీతో కొత్త TVS రైడర్ 125cc బైక్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలుసా?

TVS Raider : భారత మార్కెట్లోకి మోస్ట్ అడ్వాన్స్‌డ్ 125CC టీవీఎస్ న్యూ రైడర్‌ బైక్ లాంచ్ అయింది. స్పెషల్ ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి.

TVS Raider : అడ్వాన్స్ టెక్నాలజీతో కొత్త TVS రైడర్ 125cc బైక్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలుసా?

TVS Raider

Updated On : October 6, 2025 / 8:23 PM IST

TVS Rider : టీవీఎస్ నుంచి సరికొత్త బైక్ వచ్చేసింది. పాపులర్ 125CC బైక్ టీవీఎస్ రైడర్ లేటెస్ట్ అత్యంత అడ్వాన్స్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఇప్పుడు “ది వికెడ్ ట్రోయికా” పేరుతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. సరికొత్త అవతార్‌లో పవర్, టెక్నాలజీ, సెక్యూరిటీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగి ఉంది. ఈ బైక్‌లో iGO అసిస్ట్ టెక్నాలజీతో నడిచే బూస్ట్ మోడ్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు.

6,000rpm వద్ద 11.75Nm, 11.38bhp అత్యుత్తమ టార్క్‌ను అందిస్తుంది. కొత్త రైడర్ ABSతో కూడిన (TVS Rider) డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లను కూడా కలిగి ఉంది. రైడర్లకు ఫుల్ కంట్రోలింగ్ అందిస్తుంది. దేశంలోనే మొట్టమొదటి 125cc బైక్‌లో ‘ది వికెడ్ ట్రోయికా’ అనే 3 ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో బూస్ట్ మోడ్, డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, గ్లైడ్ త్రూ టెక్నాలజీ (GTT) ఉన్నాయి. యువ రైడర్లను ఆకర్షించేందుకు కంపెనీ ఈ కొత్త టీవీఎస్ రైడర్‌ను అప్‌డేట్ చేసింది.

వేరియంట్ వారీగా ధరలు :
2025 టీవీఎస్ రైడర్ ధర కొత్త రైడర్ SXC DD వేరియంట్ రూ. 93,800 (ఎక్స్-షోరూమ్) నుంచి రైడర్ TFT డీడీ వేరియంట్ రూ. 95,600 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెలలో అన్ని టీవీఎస్మోటార్ కంపెనీ డీలర్‌షిప్‌లలో ఈ బైక్ అందుబాటులో ఉంటుంది.

Read Also : Bolero Facelift Vs Old Bolero : కొత్త కారు కొంటున్నారా? మహీంద్రా బొలెరో ఫేస్‌లిఫ్ట్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. పాత బొలెరో కన్నా బెటరా? ధర ఎంతంటే?

టీవీఎస్ సరికొత్త ఫీచర్లతో రైడర్ హీరో ఎక్స్‌ట్రీమ్ 125R, హోండా CB 125 హార్నెట్, బజాజ్ పల్సర్ 125 వంటి పాపులర్ బైక్‌ల మాదిరిగా కస్టమర్లను ఆకట్టుకునేలా ఉంది. ఈ మోటార్ సైకిల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టీవీఎస్ మోటార్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.

స్పెషల్ ఫీచర్లు ఇవే :

టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్త టీవీఎస్ రైడర్‌లో అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్‌లను అందించింది. ఈ ఫీచర్లు బైక్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తాయి. సెగ్మెంట్-ఫస్ట్ ‘బూస్ట్ మోడ్’ ఫీచర్ కూడా ఉంది. iGO అసిస్ట్ టెక్నాలజీతో రన్ అవుతుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. సింగిల్-ఛానల్ ABSతో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లను కూడా కలిగి ఉంది. సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్ ఇందులో జీటీటీ అంటే.. గ్లైడ్ త్రూ టెక్నాలజీ కూడా ఉంది. లో స్పీడ్‌తో మంచి మైలేజీని అందిస్తుంది.

ఈ టీవీఎస్ రైడర్ రెండు డిస్‌ప్లే ఆప్షన్లతో స్మార్ట్ కనెక్టివిటీని కూడా అందిస్తోంది. 99 కన్నా ఎక్కువ ఫీచర్లతో TFT స్క్రీన్, 85 కన్నా ఎక్కువ ఫీచర్లతో రివర్స్ LCD క్లస్టర్ కలిగి ఉంది. టీవీఎస్ (SmartXonnect) ప్లాట్‌ఫామ్ బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ అసిస్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ హ్యాండ్లింగ్, నోటిఫికేషన్‌లను ఇంటిగ్రేట్ చేస్తుంది.

రోజువారీ ప్రయాణాలకు అద్భుతంగా ఉంటుంది. అదనపు ఫీచర్లలో ఫాలో మీ హెడ్‌ల్యాంప్ ఉన్నాయి. ఇంజిన్ ఆపేసిన తర్వాత లైట్‌ను కొద్దిసేపు ఆన్‌లో ఉండేలా సెక్యూరిటీ ఫీచర్ ఉంది. రాత్రి సమయంలో పార్కింగ్ జోన్‌లలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.