Team India new Jersey : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026కు టీమ్ఇండియా కొత్త జెర్సీ చూశారా? అదిరిపోయింది అంతే..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో టీమ్ఇండియా స‌రికొత్త జెర్సీతో (Team India new Jersey) బ‌రిలోకి దిగ‌నుంది.

Team India new Jersey : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026కు టీమ్ఇండియా కొత్త జెర్సీ చూశారా? అదిరిపోయింది అంతే..

Team India T20 World Cup 2026 Jersey Unveiled

Updated On : December 3, 2025 / 8:29 PM IST

Team India new Jersey : వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 7 నుంచి మార్చి 8 వ‌ర‌కు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నుంది. భార‌త్‌, శ్రీలంక దేశాలు ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి. కాగా.. ఈ మెగాటోర్నీకి టీమ్ఇండియా స‌రికొత్త జెర్సీతో బ‌రిలోకి దిగ‌నుంది. ఈ కొత్త జెర్సీని బీసీసీఐ ఆవిష్క‌రించింది.

రాయ్‌పుర్ వేదికగా ద‌క్షిణాఫ్రికాతో రెండో వ‌న్డే సంద‌ర్భంగా ఇన్నింగ్స్ విరామ స‌మ‌యంలో టీమ్ఇండియా ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మ‌లు జెర్సీని లాంఛ్ చేశారు. ఈ వేడుక‌లో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పాల్గొన్నారు.

Mohit Sharma : క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన మోహిత్ శ‌ర్మ‌.. ధోని సార‌థ్యంలో అరంగ్రేటం చేసి..

2024 T20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్, 2026 ఎడిషన్ బ్రాండ్ అంబాసిడర్ అయిన రోహిత్ శర్మ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ టీమ్ఇండియాకు శుభాకాంక్షలు తెలియ‌జేశాడు.

కొత్త జెర్సీ విష‌యానికి వ‌స్తే..

భారత జెండాలోని మొత్తం మూడు రంగులు ఈ జెర్సీలో ఉన్నాయి. ఎక్కువ‌గా ముదురు నీలం రంగు ఉండ‌గా.. ఇరు వైపులా ఆరెంజ్ రంగు ఉంది. కాలర్‌ దగ్గరలో తెలుపు రంగు ఉంది. జెర్సీ మధ్యలో స్పాన్సర్‌ అపోలో టైర్స్‌, ఇండియా అని పేరు రాసి ఉంది. ప్ర‌స్తుతం కొత్త జెర్సీ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

IND vs SA : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. భారత జట్టు ఇదే.. గిల్‌కు చోటు కానీ చిన్న ట్విస్ట్‌

గ్రూపు-ఎలో భారత్‌..

ఈ మెగాటోర్నీలో మొత్తం 20 దేశాలు పాల్గొంటున్నాయి. భార‌త్ గ్రూపు-ఏలో ఉంది. టీమ్ఇండియాతో పాటు పాకిస్తాన్‌, నెద‌ర్లాండ్స్‌, న‌మీబియా, అమెరికాలు గ్రూప్‌-ఏలో ఉన్నాయి. భార‌త జ‌ట్టు తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న ఆడ‌నుంది. వాంఖ‌డే వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో అమెరికాతో త‌ల‌ప‌డ‌నుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూసే భార‌త్‌, పాక్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 15న కొలంబో వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.