Mohit Sharma : క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన మోహిత్ శ‌ర్మ‌.. ధోని సార‌థ్యంలో అరంగ్రేటం చేసి..

టీమ్ఇండియా వెట‌ర‌న్ ఆట‌గాడు మోహిత్ శ‌ర్మ (Mohit Sharma) క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు.

Mohit Sharma : క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన మోహిత్ శ‌ర్మ‌.. ధోని సార‌థ్యంలో అరంగ్రేటం చేసి..

Mohit Sharma has announced retirement from all forms of the game

Updated On : December 3, 2025 / 7:22 PM IST

Mohit Sharma : టీమ్ఇండియా వెట‌ర‌న్ ఆట‌గాడు మోహిత్ శ‌ర్మ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు. 2013లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన మోహిత్ శ‌ర్మ (Mohit Sharma)చివ‌రిసారిగా 2015లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వ‌హించాడు. అత‌డు భార‌త్ త‌రుపున 26 వ‌న్డేలు, 8 టీ20లు ఆడాడు. వ‌న్డేల్లో 31 వికెట్లు, టీ20ల్లో ఆరు వికెట్లు సాధించాడు.

‘ఈ రోజు నుంచి నేను క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టిస్తున్నాను. హర్యానాకు ప్రాతినిధ్యం వహించడం నుండి భారత జెర్సీ ధరించడం, ఐపీఎల్‌లో ఆడటం వరకు ఎంతో గొప్ప‌వ‌రంలా భావిస్తున్నాను.’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో మోహిత్ శ‌ర్మ రాసుకొచ్చాడు.

IND vs SA : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. భారత జట్టు ఇదే.. గిల్‌కు చోటు కానీ చిన్న ట్విస్ట్‌

 

View this post on Instagram

 

A post shared by Mohitmahipal Sharma (@mohitsharma18)


త‌న క్రికెట్ కెరీర్‌కు వెన్నుముక‌గా నిలిచిన హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ‌జేశాడు. బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, త‌న స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు, కోచ్‌లు, కుటుంబ స‌భ్యులు, స్నేహితులతో పాటు త‌న క్రికెట్ ప్ర‌యాణంలో భాగ‌స్వాములు అయిన వారంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు.

Virat Kohli : కోహ్లీ శ‌త‌కాల మోత‌.. వ‌రుస‌గా రెండో వ‌న్డేలోనూ సెంచ‌రీ..

2013లో మ‌హేంద్ర సింగ్ ధోని నాయ‌కత్వంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రుపున ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు. తొలి ఐపీఎల్ సీజ‌న్‌లోనే మోహిత్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. 15 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీశాడు. ఆ సీజన్‌లో అతని ప్రదర్శనకు ప్రతిఫలం లభించింది. వెంట‌నే అత‌డికి టీమ్ఇండియాలో చోటు ద‌క్కింది. జింబాబ్వేతో జరిగిన సిరీస్ కోసం అత‌డిని వన్డే జట్టులోకి తీసుకున్నారు.

ఇక మొత్తంగా మోహిత్ శ‌ర్మ ఇప్ప‌టి వ‌ర‌కు 120 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 134 వికెట్లు తీశాడు.