Virat Kohli : కోహ్లీ శతకాల మోత.. వరుసగా రెండో వన్డేలోనూ సెంచరీ..
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli ) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
Virat Kohli back to back centuries in ODI series against South Africa
Virat Kohli : టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ చేశాడు. రాంచి వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో శతకం చేసిన కోహ్లీ.. రాయ్‌పుర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లోనూ మూడు అంకెల స్కోరు అందుకున్నాడు.
𝙐𝙣𝙨𝙩𝙤𝙥𝙥𝙖𝙗𝙡𝙚! 👑
BACK to BACK ODI HUNDREDS for Virat Kohli 🫡🫡
His 5⃣3⃣rd in ODIs 💯
Updates ▶️ https://t.co/oBs0Ns6SqR#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/sahZeIUo19
— BCCI (@BCCI) December 3, 2025
Ruturaj Gaikwad : వన్డేల్లో తొలి సెంచరీ సాధించిన రుతురాజ్ గైక్వాడ్..
మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 90 బంతుల్లో కోహ్లీ సెంచరీ చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. వన్డేల్లో కోహ్లీకి ఇది 53వ సెంచరీ కావడం విశేషం. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు ప్రస్తుతం కోహ్లీ పేరిటే ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లీ మొత్తంగా 93 బంతులు ఎదుర్కొన్నాడు. 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. ఎంగిడి బౌలింగ్‌లో మార్‌క్రమ్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు.
ఇదిలా ఉంటే.. వరుసగా రెండు వన్డే మ్యాచ్‌ల్లోనూ శతకం చేయడం కోహ్లీ కెరీర్‌లో ఇది 11వ సారి.
