IND vs SA : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. భారత జట్టు ఇదే.. గిల్‌కు చోటు కానీ చిన్న ట్విస్ట్‌

భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య (IND vs SA) డిసెంబ‌ర్ 9 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జ‌ర‌గ‌నుంది.

IND vs SA : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. భారత జట్టు ఇదే.. గిల్‌కు చోటు కానీ చిన్న ట్విస్ట్‌

India squad for T20I series against South Africa

Updated On : December 3, 2025 / 6:16 PM IST

IND vs SA : భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య డిసెంబ‌ర్ 9 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఈ టీ20 సిరీస్ లో పాల్గొనే భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. 15 మందికి ఇందులో చోటు క‌ల్పించింది. టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌ సూర్య‌కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోనే భార‌త జ‌ట్టు బ‌రిలోకి దిగ‌నుంది.

మెడ ప‌ట్టేయ‌డంతో ద‌క్షిణాప్రికాతో రెండో టెస్టు మ్యాచ్‌, వ‌న్డే సిరీస్‌కు దూరంగా ఉన్న శుభ్‌మ‌న్ గిల్ టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వ‌చ్చాడు. అయితే.. బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇచ్చే రిపోర్టు పైనే గిల్ ఆడ‌తాడా? లేదా? అనేది ఉంటుంద‌ని సెల‌క్ట‌ర్లు తెలిపారు.

IND vs SA : సెంచ‌రీల‌తో చెల‌రేగిన కోహ్లీ, రుతురాజ్‌.. రెండో వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికా ముందు భారీ ల‌క్ష్యం..

ఇక గాయం కార‌ణం జ‌ట్టుకు దూరంగా ఉన్న ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇచ్చాడు. సంజూ శాంస‌న్‌, జితేశ్ శ‌ర్మ‌ల‌కు చోటు ద‌క్కింది. టీమ్ఇండియా న‌యా ఫినిష‌ర్ రింకూ సింగ్‌కు చోటు ద‌క్క‌లేదు.

ద‌క్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఇదే..

సూర్యకుమార్ యాదవ్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హర్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్‌, జితేశ్‌ శర్మ, సంజూ శాంసన్‌, వరుణ్‌ చక్రవర్తి, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, వాషింగ్టన్‌ సుందర్‌.

Virat Kohli : కోహ్లీ శ‌త‌కాల మోత‌.. వ‌రుస‌గా రెండో వ‌న్డేలోనూ సెంచ‌రీ..

టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..

* తొలి టీ20 మ్యాచ్ – డిసెంబ‌ర్ 9న (క‌ట‌క్‌)
* రెండో టీ20 మ్యాచ్ – డిసెంబ‌ర్ 11న (ఛండీగ‌ర్‌)
* మూడో టీ20 మ్యాచ్ – డిసెంబ‌ర్ 14న (ధ‌ర్మ‌శాల‌)
* నాలుగో టీ20 మ్యాచ్ – డిసెంబ‌ర్ 17న (ల‌క్నో)
* ఐదో టీ20 మ్యాచ్ – డిసెంబ‌ర్ 19న (అహ్మ‌దాబాద్‌)