Ind Vs SA: రెండో వన్డేలో భారత్ పరాజయం.. సౌతాఫ్రికా సంచలన విజయం
Courtesy @ ESPNCricInfo
Ind Vs SA: రెండో వన్డేలో భారీ స్కోర్ చేసినా భారత్ కు పరాజయం తప్పలేదు. కొండంత లక్ష్యాన్ని కూడా సౌతాఫ్రికా ఈజీగా ఛేజ్ చేసింది. ఉతంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో భారత్ పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 రన్స్ చేసింది.
359 రన్స్ టార్గెట్ ను సౌతాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి మరో 4 బంతులు మిగిలి ఉండగానే.. ఛేదించింది. ఓపెనర్ మార్క్రమ్ సెంచరీతో చెలరేగాడు. 98 బంతుల్లో 110 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు బాధ్యతగా ఆడి జట్టుకి విజయాన్ని అందించారు. తొలి వన్డేలో పరాజయం పాలైన సౌతాఫ్రికా.. రెండో వన్డేలో కమ్ బ్యాక్ చేసింది. ఇక సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డే డిసెంబర్ 6న వైజాగ్ లోజరగనుంది.
తొలి వన్డేలో భారీ స్కోర్ చేసిన భారత్.. రెండో వన్డేలోనూ చెలరేగింది. 5 వికెట్ల నష్టానికి 358 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్(14), జైస్వాల్(22) నిరాశపరచగా.. రుతురాజ్(83 బంతుల్లో 105 పరుగులు) వన్డేల్లో తొలి సెంచరీ బాదాడు. విరాట్ కోహ్లీ మరోసారి మెరిశాడు. వరుసగా రెండో వన్డేలోనూ శతకం (93 బంతుల్లో 102 పరుగులు) నమోదు చేశారు. రాహుల్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, వరుసగా రెండో హాఫ్ సెంచరీ (66* 43 బంతుల్లో) చేశాడు.
Also Read: టీ20 ప్రపంచకప్ 2026కు టీమ్ఇండియా కొత్త జెర్సీ చూశారా? అదిరిపోయింది అంతే..
