Factory Outlets : బ్రాండెడ్ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్లు.. ఫ్యాక్టరీ ఔట్‌లెట్స్‌లో ఎందుకిలా? బిగ్ సీక్రెట్ ఏంటి?

Huge Discounts In Factory Outlets : ఫ్యాక్టరీ ఔట్ లెట్స్ లో ఎందుకు ధరలు అంత తక్కువగా ఉంటాయి? ఎందుకు భారీగా డిస్కౌంట్స్ ఇస్తాయి? వాళ్లకు నష్టం రాదా? ఇలాంటి సందేహాలు చాలానే వచ్చి ఉంటాయి.

Huge Discounts In Factory Outlets (Photo : Google)

బ్రాండెడ్ ఉత్పత్తులు కొనాలని అందరూ ఆశ పడతారు. కానీ, వాటి ధరలు చూస్తే దిమ్మతిరిగిపోవడం ఖాయం. జేబులు ఖాళీ అవడం ఖచ్చితం. వాటి ధరలు చూస్తే.. అమ్మో.. అంత రేటా? అని అనకుండా ఉండలేరు. అందుకే, చాలామంది అన్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ తోనే అడ్జస్ట్ అయిపోతారు. అయితే, ఓ పని చేస్తే మీరు కూడా ఎంచక్కా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కొనొచ్చు. అదీ తక్కువ ధరకే. ఏంటి నమ్మబుధ్ది కావడం లేదా? కానీ, ఇది నిజమే. బ్రాండెడ్ ఉత్పత్తులు తక్కువ రేటుకే కొనాలని అనుకుంటే.. ఆ బ్రాండ్లకు సంబంధించిన ఫ్యాక్టరీ ఔట్ లెట్స్ కు వెళ్లడమే.

ఫ్యాక్టరీ ఔట్ లెట్స్ లో ధరలు తక్కువ.. ఎందుకంటే..
ఈ ఫ్యాక్టరీ ఔట లెట్ లు.. సాధారణ దుకాణాలు, మాల్స్, షోరూమ్‌లతో పోలిస్తే అదే బ్రాండెడ్ ఉత్పత్తులను చాలా తక్కువ ధరకు అందిస్తాయి. మనలో చాలామంది చూసే ఉంటాము.. క్లియరెన్స్ సేల్ పేరుతో ఫ్యాక్టరీ ఔట్ లెట్స్ లో విక్రయాలు జరుపుతుంటారు. భారీగా డిస్కౌంట్లు ఇస్తారు. ఫ్లాట్ 50 పర్సెంట్ డిస్కౌంట్ అని, ఫ్లాట్ 70 పర్సెంట్ డిస్కౌంట్ అని ఆఫర్లతో ఊరిస్తారు. ఇంకేముందు.. భారీ డిస్కౌంట్ అనడంతో జనాలు క్యూ కట్టేస్తారు. ఎగబడి మరీ ప్రొడక్ట్స్ ను (దుస్తులు, షూస్ లాంటివి) కొంటారు.

అయితే, ఇక్కడ మరో సందేహం రావొచ్చు. ఫ్యాక్టరీ ఔట్ లెట్స్ లో ఎందుకు ధరలు అంత తక్కువగా ఉంటాయి? ఎందుకు భారీగా డిస్కౌంట్స్ ఇస్తాయి? కాస్ట్ లీ ప్రొడక్ట్ ను ఎందుకంత చీప్ గా అమ్ముతారు? వాళ్లకు నష్టం రాదా? ఇలాంటి అనేక సందేహాలు చాలాసార్లు మీకు వచ్చి ఉంటాయి కదూ. మరి, దీని వెనుక సీక్రెట్ ఏంటో? కారణాలు ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.

Factory Outlets Sales (Photo : Google)

స్టాక్ క్లియరెన్స్..
ఫ్యాక్టరీ ఔట్ లెట్స్ లో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ పై భారీగా డిస్కౌంట్స్ ఇవ్వడానికి, తక్కువ ధరకే అమ్మేయడానికి ప్రధాన కారణం స్టాక్ క్లియరెన్స్. తరచుగా స్టాక్‌ను క్లియర్ చేయడం కోసం ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తుంటారు. బ్రాండ్ ప్రొడక్ట్‌ లైన్‌ దాదాపుగా సేల్‌ అయిపోయినప్పుడు, మిగిలిపోయిన వాటిని కూడా క్లియర్ చేయడానికి.. స్టాక్ క్లియరెన్స్ సురక్షిత మార్గం. స్టాక్ క్లియరెన్స్ ద్వారా మేకింగ్ ఛార్జీలను తిరిగి పొందొచ్చు. దాంతో పాటుగా కొత్త ఉత్పత్తులను స్టాక్ లోకి తీసుకురావొచ్చు.

Also Read : బంగారం కొంటున్నారా.. తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు, ఇలా చేస్తే మీకే లాభం

లేబులింగ్ లో చిన్న చిన్న లోపాలు..
ప్రొడక్ట్ లో చిన్న చిన్న లోపాలు ఉన్నా మెయిన్‌ స్ట్రీమ్‌ బ్రాండ్‌ ఔట్ లెట్స్ లో ప్రదర్శనకు రిజెక్ట్‌ అవుతాయి. లూజ్ థ్రెడ్, వాషింగ్ ఇన్‌స్ట్రక్షన్స్, సైజు ట్యాగ్‌లు, స్టైల్ టైప్ ట్యాగ్‌లలో చిన్న లోపాల కారణంగా వాటిని తిరస్కరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపరు. ఈ తరహా చిన్న చిన్న లోపాలు ఉన్న ఉత్పత్తులను అమ్మేయడానికి ఫ్యాక్టరీ ఔట్ లెట్స్ కు పంపేస్తారు. భారీ డిస్కౌంట్ పేరుతో వాటిని అమ్మేస్తారు.

Huge Discounts On Products In Factory Outlets (Photo : Google)

డిజైన్ లో చిన్న చిన్న మార్పులు..
స్టోర్ లో ప్రదర్శించే ఉత్పత్తులు అన్నీ ఒకే రకంగా ఉంటాయి. అయితే, వాటి థ్రెడ్ వర్క్ లో తేడాలు ఉండొచ్చు. అలాగే కలర్స్ షేడ్ అయ్యి ఉండొచ్చు. ఇలాంటి చిన్న చిన్న అంశాలను కొనుగోలుదారులు గుర్తించలేకపోవచ్చు. అయితే, నైతిక విలువల పరంగా అలాంటి ప్రొడక్టులను తక్కువ ధరకు అమ్మాలి. అందుకే, వాటిని ఫ్యాక్టరీ ఔట్ లెట్స్ కు పంపిస్తారు. అక్కడ అమ్మేస్తారు.

ఓవర్ సప్లయ్…
కొన్నిసార్లు సెల్లర్లకి కొన్ని ఉత్పత్తులు పెద్ద మొత్తంలో సరఫరా అవుతాయి. అదనపు స్టాక్‌ను తిరిగి ఇవ్వడానికి లేదా నిల్వ చేయడానికి గణనీయమైన ఖర్చులు అవుతాయి. దీంతో వాటిని ఫ్యాక్టరీ ఔట్ లెట్స్ కు పంపిస్తారు. తద్వారా మిగులు ప్రొడక్టులను క్లియర్‌ చేసుకోవచ్చు. కొత్త స్టాక్‌ కోసం స్థలం ఖాళీ చేయవచ్చు.

Factory Outlets Sales (Photo : Google)

ఆర్డర్లు క్యాన్సిల్ కావడం..
కొంతమంది కొనుగోలుదారులు ప్రొడక్ట్ ను ఆర్డర్ చేసి డెలివరీ అయిన తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. ఆ ప్రొడక్ట్ ను తిరిగి వెనక్కి పంపొచ్చు. దీనికి కారణాలు అనేకం కావొచ్చు. అండే ప్రొడక్ట్ డ్యామేజ్ అయి ఉండొచ్చు లేదా కొనుగోలుదారుడి నిర్ణయంలో మార్పు కావొచ్చు. డెలివరీ అయిన తర్వాత ప్రొడక్టు కొంచెం నచ్చకపోయినా రిటర్న్ చేసేస్తారు. ఇలాంటి ఉత్పత్తులను మళ్లీ ర్యాక్‌లలో పెట్టి అమ్మడానికి వికేత్రదారులు ఒప్పుకోరు. అంతేకాదు తగ్గింపు ధరకు వాటిని విక్రయించడం మేలని భావిస్తారు. అందుకే, అలాంటి ప్రొడక్ట్స్ ను ఫ్యాక్టరీ ఔట్ లెట్స్ కు పంపేస్తారు.

Also Read : ఉడకబెట్టిన గుడ్డు Vs ఆమ్లెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ మంచిది? ఇలా తెలుసుకోండి..

సో, ఇదండి.. బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అయినప్పటికీ.. ఫ్యాక్టరీ అవుట్ లెట్లలో భారీ డిస్కౌంట్లు ఇచ్చి మరీ తక్కువ ధరకే అమ్మడానికి గల కారణాలు. మాల్స్, షాప్స్ తో పోలిస్తే.. బ్రాండెడ్ ఔట్ లెట్స్ లో ప్రొడక్ట్స్ రేట్లు ఎందుకు తక్కువ అంటే, ఇవీ రీజన్స్ అన్న మాట. సో.. భలే మంచి చౌక బేరం అని మురిసిపోవడం అటుంచితే.. కొనే ముందు ఓసారి ప్రొడక్ట్ ను బాగా చెక్ చేసుకోవడం ఎంతైనా మంచిది.

ట్రెండింగ్ వార్తలు