కరోనా వైరస్ రోజురోజుకి వేగంగా విస్తరిస్తున్నందున ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్నిరోజుల పాటు తన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వీలైనంత వరకు త్వరగా మీ ముందుకు వస్తామని అందరూ సురక్షితంగా ఉండండి, ఇంట్లోనే ఉంటూ మనల్ని కాపాడుకుందాం అని ప్రకటన జారీ చేశారు.
అమెజాన్ కూడా తన సర్వీసులను నిలిపివేసింది. అత్యవసర సరుకులు తప్ప మిగతా అన్ని రకాల సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇటలీలో కరోనా వ్యాధి సోకి చనిపోతుంటే… వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. అది దృష్టిలో పెట్టుకుని అయినా ప్రజలంతా ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలకు, అధికారులకు సహకరిస్తే మనందరం ఆరోగ్యంగా ఉంటాం అని తెలిపారు.
మరోవైపు కూరగాయలు, నిత్యావసరాల ధరలు కూడా మండిపోతున్నాయి. ఇది డబ్బు సంపాదించే సమయంకాదని హాస్య నటుడు అలీ వ్యాఖ్యానించారు. కరోనా కట్టడి కోసం రెండు తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలకు చెరో లక్ష రూపాయలు ఆయన విరాళంగా ఇచ్చారు.
Also Read | నాలుకపై బ్యాక్టీరియా ఎలా.. ఎక్కడ పేరుకుపోతుందో తెలుసా..