Electoral Bonds Data : ఎలక్టోరల్ బాండ్ల డేటా బహిర్గతం.. వెబ్‌సైట్లో అప్‌డేట్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. పూర్తి వివరాలివే!

Electoral Bonds Data : ఎస్బీఐ సమర్పించిన ఎలక్టోరల్ బాండ్స్ డేటా వివరాలను ఎలక్షన్ కమిషన్ ఈరోజు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Electoral Bonds Data : భారత ఎన్నికల సంఘం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే ఎన్నిలక సంఘం వెబ్‌సైట్లో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అప్‌లోడ్ చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను బహిర్గత పరచడంలో కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించింది.

సుప్రీంకోర్టు విధించిన గడువుకు ఒకరోజు ముందే ఈ వివరాలను అప్‌లోడ్ చేసింది. ఎస్బీఐ సమర్పించిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను తమ వెబ్‌సైట్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ (https://www.eci.gov.in/candidate-politicalparty)లో అప్‌డేట్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను తెలుసుకోవచ్చు.

Read Also : SBI Electoral Bonds : సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు దిగొచ్చిన ఎస్‌బీఐ.. ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలన్నీ ఎన్నికల సంఘం చేతుల్లోకి..!

మొత్తం రెండు జాబితాలుగా :
ఈసీ వెబ్‌సైట్‌లో మొత్తం రెండు జాబితాలు ఉన్నాయి. మొదటిది డినామినేషన్, తేదీలతో పాటు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీలు ఉన్నాయి. మరొకదానిలో రాజకీయ పార్టీల పేర్లతో పాటు బాండ్ల డినామినేషన్లు, ఎన్‌క్యాష్ చేసిన తేదీలు ఉన్నాయి. అయితే, ఈ జాబితాల్లోని డేటా ఏ కంపెనీ లేదా వ్యక్తి నుంచి ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చారో తెలుసుకునే అవకాశం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

టాప్ 10 దాతల జాబితా వివరాలు :
అత్యధిక సహకారం అందించిన సంస్థ ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సర్వీసెస్ పీఆర్ రూ.1,368 కోట్ల విలువైన బాండ్‌లను కొనుగోలు చేసింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ రూ. 966 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసి రెండో స్థానంలో ఉంది. రూ. 410 కోట్లతో (Qwik) సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ మూడో స్థానంలో ఉంది. వేదాంత లిమిటెడ్ రూ. 400 కోట్లు, హల్దియా ఎనర్జీ లిమిటెడ్ రూ. 377 కోట్లతో నాలుగు, ఐదో స్థానంలో ఉన్నాయి. రూ.247 కోట్లు విరాళంగా అందించిన భారతి గ్రూప్ 6వ స్థానంలో ఉంది.

టాప్ 10 దాతల జాబితాలో మిగిలిన ముగ్గురు వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ లిమిటెడ్, రూ. 220 కోట్లు, కెవెంటర్ ఫుడ్‌పార్క్ ఇన్‌ఫ్రా లిమిటెడ్, రూ.195 కోట్లు, మదన్‌లాల్ లిమిటెడ్ రూ. 185 కోట్లు ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్లను ఎన్‌క్యాష్ చేసిన పార్టీలలో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, సమాజ్ వాదీ పార్టీ, ఏఐఏడీఎంకే, బీఆర్‌ఎస్, శివసేన, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, డీఎంకే, జేడీఎస్, ఎన్సీపీ, జేడీయూ, ఆర్జేడీ ఉన్నాయి.

ఈ మొత్తం డేటాను పబ్లిక్‌గా విడుదల చేసినట్లు భారత ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్ల కేసులో పిటిషనర్లలో ఒకరైన అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరపున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. డేటాలో బాండ్ల క్రమ సంఖ్యలు పేర్కొనలేదని ఎత్తి చూపారు. ఏ పార్టీకి ఎవరు ఎంత విరాళం ఇచ్చారో తెలుసుకోవడానికి ఇది అవసరమని ఆయన అన్నారు. విరాళాలు అనామకంగా ఉండకూడదనేది సుప్రీంకోర్టు ఆదేశాలలో అంతర్లీనంగా ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు హెచ్చరిక :
గత సోమవారం విచారణ సందర్భంగా.. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మార్చి 6 నాటికి ఎన్నికల సంఘానికి అందజేసే డేటాపై ఆదేశాన్ని ఉల్లంఘించినందుకు ఎస్‌బీఐపై మండిపడింది. మంగళవారంలోగా ఎన్నికల కమిషన్‌కు డేటా సమర్పించాలని ఎస్‌బీఐని ఆదేశించిన కోర్టు.. అలా చేయడంలో విఫలమైతే ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ఆదేశాలను పాటించిన తర్వాత అఫిడవిట్ దాఖలు చేయాలని బ్యాంక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌ను కోర్టు ఆదేశించింది.

ఎస్బీఐ మంగళవారం డేటాను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఆ తర్వాత రోజు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్షంగా ప్రకటించి సుప్రీంకోర్టు కొట్టివేయడానికి ముందు, ఏప్రిల్ 2019, ఫిబ్రవరి 15, 2024 మధ్య 22,217 ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసినట్లు అఫిడవిట్ పేర్కొంది. రాజకీయ పార్టీలు 22,030 బాండ్లను రీడీమ్ చేశాయని, మిగిలిన 187 బాండ్లను రీడీమ్ చేశామని, నిబంధనల ప్రకారమే నగదును ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో జమ చేశామని బ్యాంక్ తెలిపింది.

Read Also : Petrol Diesel Prices : కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు, లీటర్‌పై ఎంత తగ్గిందంటే..

ట్రెండింగ్ వార్తలు