Electric Scooters in India _ Top 5 Cheapest Low-Speed Electric Scooters in India 2023
Electric Scooters in India : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. 2023లో అత్యంత చౌకైన ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో ఈవీ స్కూటర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. భారత మార్కెట్లో ఈవీ స్కూటర్లను ఎంచుకునేందకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 2023 ఈవీ స్కూటర్లను కొనుగోలు చేయాలంటే.. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. రిజిస్ట్రేషన్ కూడా అక్కర్లేదు. ఈవీ స్కూటర్‌లు గరిష్టంగా 25kmph స్పీడ్, గరిష్టంగా 250-వాట్ మోటార్‌ను కలిగి ఉన్నాయి. ఈవీ స్కూటర్లను లైసెన్స్ లేకుండా ఎవరైనా నడపవచ్చు. మీరూ కూడా ఇలాంటి ఈవీ స్కూటర్లను కొనేందుకు చూస్తుంటే.. టాప్ 7 చౌకైన తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఈవీ స్కూటర్ మోడల్ కొనుగోలు చేయొచ్చు..
ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితా :
1. Avon E Plus :
ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం రూ. 25వేల ధరకే సొంతం చేసుకోవచ్చు. మీరు తక్కువ బడ్జెట్‌లో చూస్తుంటే.. Avon E Plus గొప్ప ఆప్షన్ అని చెప్పవచ్చు. E Plus పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 50 కి.మీ వరకు దూసుకెళ్తుంది. ఈ స్కూటర్ బ్యాటరీ సామర్థ్యం 48 v/12 Ah గరిష్టంగా 24 km/ph స్పీడ్ అందిస్తుంది. స్కూటర్ ఛార్జింగ్ సమయం 6.5 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. డిజైన్ వారీగా ఈ స్కూటర్ చాలా తేలికైనది. చౌకైన తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ఉండటానికి ఏకైక కారణం అని చెప్పవచ్చు.
Electric Scooters in India _ Top 5 Cheapest Low-Speed Electric Scooters
ధర : రూ. 25,000
పరిధి : 50 కి.మీ
బ్యాటరీ సామర్థ్యం : 48v/12ah
గరిష్ఠ వేగం : గంటకు 24కి.మీ
ఛార్జింగ్ సమయం : 6.5 నుంచి 8 గంటలు
2. Detel Easy Plus :
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ (Detel Easy Plus) ధర రూ. 40వేల రేంజ్‌లో ఉంది. చౌకైన తక్కువ-వేగం గల ఎలక్ట్రిక్ స్కూటర్‌ల జాబితాలో 2వ స్థానంలో ఉంది. డిజైన్ పరంగా చూస్తే.. అత్యంత ఆకర్షణీయమైన ఎంపిక కాదనే చెప్పాలి. కానీ తక్కువ ధరను పరిగణనలోకి తీసుకుంటే ఫీచర్లు అద్భుతంగా ఉంటాయి. ఈ స్కూటర్ ముఖ్యమైన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
Electric Scooters in India _ Top 5 Cheapest Low-Speed Electric Scooters in India
పరిధి : 60 కిమీ/ఛార్జ్
బ్యాటరీ కెపాసిటీ : 1.25 KWH
ఛార్జింగ్ సమయం : 4-5 గంటలు
బ్యాటరీ టైప్ : లిథియం-అయాన్
బ్యాటరీ వారంటీ : 3 సంవత్సరాలు
మోటార్ పవర్ : 250 W
టాప్ స్పీడ్ : 25 km/ph
3. Ampere Reo Elite :
ఈ కొత్త ఆంపియర్ రియో ఎలైట్ ఈవీ స్కూటర్ (Ampere Reo Elite) ధర రూ.44,500 నుంచి అందుబాటులో ఉంది. ఆంపియర్ రియో ఎలైట్ ఈవీ స్కూటర్ డిజైన్ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఈ జాబితాలో మొదటి స్కూటర్ ఇదే. సాధారణంగా కనిపించే ఈ స్కూటర్ తక్కువ శక్తిని కలిగి ఉండి లైసెన్స్ లేకుండా రోడ్డుపై సురక్షితంగా నడపవచ్చు. ఈ స్కూటర్ స్పెసిఫికేషన్లకు సంబంధించి కింది వివరాలను చూడవచ్చు.
Electric Scooters in India _ Top 5 Cheapest Low-Speed Electric Scooters
ధర : రూ. 44,500
పరిధి : 60 కి.మీ
బ్యాటరీ సామర్థ్యం : 20Ah లెడ్-యాసిడ్
బ్యాటరీ గరిష్ఠ వేగం : 25కి.మీ
ఛార్జింగ్ సమయం ~ 8 గంటలు
4. Hero Electric Flash E2 :
హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ E2 ధర రూ. 52,500గా ఉంటుంది. ఈ స్కూటర్ స్లిమ్, లైట్ వెయిట్ బాడీ డిజైన్‌తో 2013ish ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ స్కూటర్‌లో వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి.
Electric Scooters in India _ Top 5 Cheapest Low-Speed Electric Scooters
ధర : రూ. 52,500
పరిధి : 65 కి.మీ
బ్యాటరీ సామర్థ్యం : 51.2V/30Ah
గరిష్ఠ వేగం : 25కి.మీ
ఛార్జింగ్ సమయం : 4-5 గంటలు
5. Lohia Oma Star Li :
లోహియా ఓమా స్టార్ లి ఈవీ స్కూటర్ ధర 41,444గా ఉంది. లోహియా కంపెనీ ఇతర కంపెనీల మాదిరిగా పాపులర్ కంపెనీ. అయితే, ఈ స్కూటర్ తక్కువ ధరకు మంచి ఫీచర్లను అందిస్తుంది.
Electric Scooters in India _ Top 5 Cheapest Low-Speed Electric Scooters
ధర : రూ. 41,444
పరిధి : 60 కి.మీ
బ్యాటరీ సామర్థ్యం : 48V/20Ah
గరిష్ఠ వేగం : 25కి.మీ
ఛార్జింగ్ సమయం : 6-8 గంటలు
6. Okinawa Lite :
కొత్త ఈవీ స్కూటర్ల జాబితాలో చివరి రెండు స్థానాల్లో ఒకినావా లైట్ ఒకటి. తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లను అందించడమే ఏకైక కారణంగా చెప్పవచ్చు. మెరుగైన ఫీచర్లను అందించే పోటీదారులతో పోల్చితే ఈవీ స్కూటర్లపై ఎక్కువ వసూలు చేస్తారు. అదేవిధంగా ఒకినావా లైట్ ఈవీ స్కూటర్ కూడా అదే ధరకు అందుబాటులో ఉంది.
Electric Scooters in India _ Top 5 Cheapest Low-Speed Electric Scooters
ధర : రూ. 67,000
పరిధి : 60 కి.మీ
బ్యాటరీ సామర్థ్యం : 1.25 kWh
గరిష్ఠ వేగం : 25కి.మీ
ఛార్జింగ్ సమయం : 6-7 గంటలు
7. OKINAWA R30 :
ఒకినావా R30 ఈవీ స్కూటర్ జాబితాలో చివరిది. ఈ స్కూటర్‌లో డిటాచబుల్ బ్యాటరీతో సహా అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ధర విషయానికి వస్తే.. రూ. 62,500గా ఉంటుంది. పరిధి 65 కి.మీ ఉండగా, బ్యాటరీ సామర్థ్యం 1.25 KWH వరకు అందిస్తుంది. లిథియం-అయాన్ (డిటాచబుల్ బ్యాటరీ)తో పాటు గరిష్ఠ వేగం 25కి.మీ, ఛార్జింగ్ సమయం 4-5 గంటలు వరకు అందిస్తుంది.
Electric Scooters in India _ Top 5 Cheapest Low-Speed Electric Scooters
ఈ జాబితాలో 2023లో భారత్‌లోని టాప్ 7 చౌకైన తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అందిస్తున్నాం. ఈ స్కూటర్‌లు గరిష్టంగా 25 km/ph వేగాన్ని కలిగి ఉంటాయి. భారతీయ మోటారు వాహన చట్టాల ప్రకారం.. ఎటువంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదని గమనించాలి. ఈ స్కూటర్లు ఇతర స్కూటర్లతో పోలిస్తే చాలా తేలికగా ఉంటాయి.