Honda City 2023 Bookings : కొత్త కారు కొంటున్నారా? హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ మోడల్ వచ్చేస్తోంది.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!
Honda City 2023 Bookings : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) నుంచి త్వరలో 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ కారును లాంచ్ చేయనుంది. డీలర్ వర్గాల ప్రకారం.. కొత్త అప్‌డేట్ కారు మోడల్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

Honda City 2023 bookings start, here are more details
Honda City 2023 Bookings : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) నుంచి త్వరలో 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ కారును లాంచ్ చేయనుంది. డీలర్ వర్గాల ప్రకారం.. కొత్త అప్‌డేట్ కారు మోడల్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఏ కస్టమర్ అయినా రూ. 21,000 టోకెన్ మొత్తానికి మిడ్-సైజ్ సెడాన్‌ను బుక్ చేసుకోవచ్చు. హోండా సిటీ 2023 ఫిబ్రవరి చివరి నాటికి డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకోనుంది. మార్చి 2న షోరూమ్‌లలో హోండా సిటీ కారు అందుబాటులోకి రానుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం, హోండా సిటీలో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ (6MT, CVT), 1.5-లీటర్ i-DTEC డీజిల్ (6MT). కొత్త హోండా సిటీ 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ యూనిట్‌ను ఉపయోగిస్తున్నాయి.
1.5-లీటర్ i-DTEC డీజిల్ యూనిట్ రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ అయింది. హోండా సిటీ మైలేజ్ సిటీ పెట్రోల్ MTకి 17.8kmpl, సిటీ పెట్రోల్ CVTకి 18.4kmpl, సిటీ డీజిల్ MTకి 24.1kmplతో రానుంది. హోండా సిటీ ప్రస్తుతం రూ. 11.87 లక్షల నుంచి రూ. 15.62 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలతో రానుంది.

Honda City 2023 Bookings : Honda City 2023 bookings start, here are more details
ఈ కొత్త హోండా సిటీ ధర దాదాపు రూ. 12 లక్షల నుంచి ప్రారంభమై రూ. 16 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు వెళ్లవచ్చు. హోండా సిటీ e:HEV(హైబ్రిడ్)కి ఒక వేరియంట్ లేదా రెండు వేరియంట్‌లను అందించనుంది. ప్రస్తుతం, హైబ్రిడ్ మోడల్ సింగిల్ ఫుల్-లోడెడ్ ZX వేరియంట్‌లో వస్తుంది. దీని ధర రూ. 19.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). మరిన్ని వేరియంట్‌లతో హోండా సిటీ హైబ్రిడ్‌ను కొంచెం సరసమైన ధరకే అందించనుంది.

Honda City 2023 bookings start, here are more details
హోండా సిటీ హైబ్రిడ్‌లో 1.5-లీటర్ అట్కిన్సన్ సైకిల్ DOHC i-VTEC పెట్రోల్ ఇంజన్ డ్యూయల్ మోటార్లు (ట్రాక్షన్ జనరేషన్), లిథియం-అయాన్ బ్యాటరీ, e-CVT ఉన్నాయి. హోండా సిటీ హైబ్రిడ్ మైలేజ్ 26.5kmpl. హోండా సిటీ 2023 హ్యుందాయ్ వెర్నా 2023, స్కోడా స్లావియా, వోక్స్‌వ్యాగన్ వర్టస్, మారుతి సుజుకి సియాజ్‌లతో తలపడనుంది. భారత్‌లో మొదటిసారిగా 1998లో ప్రవేశపెట్టిన హోండా సిటీ ఇటీవలే దేశంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భారతీయ ఆటోమోటివ్ హిస్టరీలో ఎక్కువ కాలం నడిచిన మోడల్ ఇదే కావడం విశేషం.