Musk vs Nadella : ఏఐ.. ఏఐ.. ఏఐ.. ప్రపంచాన్ని ఇదే ఇప్పుడు శాసిస్తుంది.. ఈ ఏఐ రేసులో టెక్ కంపెనీలు పోటీపోటీగా దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే ఓపెన్ఏఐ ఏఐ రంగంలో ప్రభంజనం సృష్టించగా.. దీనికి పోటీగా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాల నుంచి కొత్త ఏఐ మోడల్స్ ప్రవేశపెట్టాయి. ఈ ఏఐ మోడల్స్ కోసం బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి.
అయితే, ఈ ఆధునిక యుగంలో ఏఐ ప్రభావం వినియోగదారులపై కూడా పడింది. చాలా వరకు టెక్ సంబంధిత పనులు వేగవంతమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో ఏఐనే తెగ వాడేస్తున్నారు.
ఓపెన్ఏఐ GPT-5 రిలీజ్ :
ఇదే క్రమంలో ఓపెన్ఏఐ మరో కొత్త అత్యంత పవర్‌ఫుల్ ఏఐ మోడల్ GPT-5ని రిలీజ్ చేసింది. ఈ ఏఐ మోడల్‌పై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఎక్స్ వేదికగా స్పందిస్తూ తన మైక్రోసాఫ్ట్ సిస్టమ్‌లో ఓపెన్ఏఐ కొత్త మోడల్ GPT-5ని పూర్తిగా ఇంటిగ్రేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై టెస్లా సీఈఓ ఎలన్ స్పందిస్తూ ఓపెన్ఏఐ మీ మైక్రోసాఫ్ట్‌ను మింగేస్తుందని నాదెళ్లను హెచ్చరించారు.
సత్యనాదెళ్ల ఏమన్నారంటే? :
వాస్తవానికి.. ఓపెన్ఏఐ ఏఐ మోడల్ GPT-5 రిలీజ్ అయ్యాక సత్య నాదెళ్ల ఈ పోస్టు పెట్టారు. GPT-5 మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, కోపైలట్, గిట్‌హబ్ కోపైలట్, అజూర్ ఏఐ ఫౌండ్రీతో సహా మా ప్లాట్‌ఫామ్‌ల్లో లాంచ్ అవుతుంది. ఓపెన్‌ఏఐ పవర్‌ఫుల్ మోడల్.
People have been trying for 50 years and that’s the fun of it! Each day you learn something new, and innovate, partner, and compete. Excited for Grok 4 on Azure and looking forward to Grok 5!
— Satya Nadella (@satyanadella) August 7, 2025
రీజనింగ్, కోడింగ్, చాట్, మోడల్స్ అన్నీ అజూర్ (Azure)లో ట్రైనింగ్ పొందాయి. సామ్ ఆల్ట్‌మన్ మా కంపెనీలో చేరి రెండున్నరేళ్లు అయింది. బింగ్‌లో జీపీటీ-4 ఇంప్లిమెంట్ చేశాం. ఎన్నో విజయాలను సాధించాం. ఇప్పుడు జీపీటీ-5 రాకతో మరింత వేగవంతం అవుతాం. ఈ కొత్త ఏఐ మోడల్ కోసం ఆసక్తిగా ఉన్నాం’’ అంటూ నాదెళ్ల పోస్టులో పేర్కొన్నారు.
మస్క్ స్వీట్ వార్నింగ్ :
నాదెళ్ల పోస్టుపై మస్క్ స్పందిస్తూ ఇలా అన్నారు. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ 13 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిందని తెలిసింది. మైక్రోసాఫ్ట్ అభివృద్ధికి ఓపెన్ఏఐ కీలక పాత్ర పోషించినప్పటికీ అది మైక్రోసాఫ్ట్‌ను సర్వ నాశనం చేస్తుందని హెచ్చరించారు.
OpenAI is going to eat Microsoft alive
— Elon Musk (@elonmusk) August 7, 2025
అంతేకాదు.. xAI గ్రోక్ 4 హెవీ మోడల్ కేవలం రెండు వారాల క్రితమే GPT-5ని అధిగమించిందని అన్నారు. G4H కూడా చాలా మెరుగ్గా ఉందని, ఈ ఏడాది చివరిలో Grok 5 కూడా వస్తుందని మస్క్ పేర్కొన్నారు. ఓపెన్ఏఐ కన్నా రెండితలు బెటర్ ఉంటుందని మస్క్ చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా, మైక్రోసాఫ్ట్ తన ప్రొడక్టులలో కొత్త ఆవిష్కరణలకు ఓపెన్ఏఐ రోడ్‌మ్యాప్‌పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. భవిష్యత్తులో ఓపెన్ఏఐ మరింత స్వయంప్రతిపత్తిని ప్రకటించాలని లేదా సొంత క్లౌడ్ మౌలిక సదుపాయాలకు మారాలని డిమాండ్ చేస్తే మైక్రోసాఫ్ట్ ఉనికికే ప్రమాదమనే సంకేతాలిచ్చారు మస్క్. మైక్రోసాఫ్ట్ ఓపెన్ఏఐతో పోటీపడలేక సొంతంగా ఏఐ మోడల్స్ క్రియేట్ చేయలేక చాలా ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు.
మస్క్ హాస్యాస్పదంగా అన్నప్పటికీ.. ఓపెన్‌ఏఐకి ఎప్పుడూ మస్క్ విమర్శించలేదు. ఎందుకంటే.. ఓపెన్ ఏఐ ప్రారంభంలో మస్క్ కూడా ఉన్నాడు. 2015లో సామ్ ఆల్ట్‌మాన్, ఇతరులతో కలిసి కంపెనీని స్థాపించాడు. మానవాళి ప్రయోజనం వైపు ఏఐ కోసం భారీగా పెట్టుబడి పెట్టాడు. కానీ, 2025లో విభేదాలతో మస్క్ 2018లో ఓపెన్‌ఏఐ బోర్డు నుంచి వైదొలిగాడు.