Airtel Best Plans : పండగ చేస్కోండి.. ఎయిర్‌టెల్ బెస్ట్ OTT రీఛార్జ్ ప్లాన్లు.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ అన్ని ఫ్రీగా చూడొచ్చు!
Airtel Best Plans : ఎయిర్‌టెల్ OTT ప్లాన్లను అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు.

Airtel Recharge Plans
Airtel Best Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. రీఛార్జ్ ప్లాన్లలో డేటా, కాలింగ్ మాత్రమే కాదు ఎంటర్‌టైన్మెంట్ కూడా అవసరంగా మారింది. ఎయిర్‌టెల్ (Airtel Best Plans) వినియోగదారుల కోసం ఇప్పుడు OTT ఆధారిత కంటెంట్ కూడా అందిస్తోంది.
కంపెనీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ వంటి OTT ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది. ఎయిర్‌టెల్ అనేక రీఛార్జ్ ప్లాన్‌లలో ఈ ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తుంది. ఎయిర్‌టెల్ OTT రీఛార్జ్ ప్లాన్లకు సంబంధించి అందించే 6 బెస్ట్ ప్లాన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రూ. 181 సోనీలైవ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ.181 ప్లాన్ అత్యంత చౌకైనది. అత్యంత ఉపయోగకరమైనది. 30 రోజుల వ్యాలిడిటీతో 15GB డేటాను అందిస్తుంది. సోనీలైవ్, Hoichoi, Chaupal, Sun NXT వంటి 22 OTT యాప్‌లకు ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తుంది. అన్ని యాప్స్ ద్వారా ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ నుంచి యాక్సస్ చేయొచ్చు.
రూ.451 హాట్‌స్టార్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో 50GB డేటా, 30 రోజుల పాటు జియోహాట్‌స్టార్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. మొబైల్‌లో టీవీ షోలు, స్పోర్ట్స్ చూసే వారికి బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు.
రూ. 598 నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ :
రూ. 598కు లభించే ఈ ప్లాన్ రియల్ ‘OTT బండిల్’. నెట్‌ఫ్లిక్స్ (బేసిక్), హాట్‌స్టార్ (మొబైల్), Zee5 (ప్రీమియం), ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ (ప్రీమియం) సబ్‌స్క్రిప్షన్‌లను ఫ్రీగా అందిస్తుంది. దాంతోపాటు, 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 SMS బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
రూ. 1199 అమెజాన్ ప్రైమ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో రోజుకు 2.5GB డేటా, అమెజాన్ ప్రైమ్ వీడియో (లైట్) ఫ్రీ సబ్‌స్క్రిప్షన్, 84 రోజుల పాటు Xstream ప్రీమియం పొందవచ్చు. హలో ట్యూన్స్, ఒక ఏడాది పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐ సర్వీసు కూడా పొందవచ్చు.
రూ. 1729 ఫుల్ ప్యాక్ ప్లాన్ :
ఈ ప్రీమియం ఎయిర్‌టెల్ ప్లాన్ అన్ని మెయిన్ OTT ప్లాట్‌ఫామ్‌లలో నెట్‌ఫ్లిక్స్ (బేసిక్), హాట్‌స్టార్ (సూపర్), Zee5 (ప్రీమియం) సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5GB డేటాను అందిస్తుంది.