Tesla First Factory in India : ఎలన్ మస్క్ టెస్లా నుంచి ఫస్ట్ ఫ్యాక్టరీ భారత్‌కు వస్తోంది.. వచ్చే ఏడాదిలో ఎంట్రీకి రంగం సిద్ధం?
Tesla First Factory in India : టెస్లా కార్ల తయారీ ప్లాంట్‌ను భారత్‌లో స్థాపించేదిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. 2024 జనవరిలో జరిగే వైబ్రాంట్ గుజరాత్ సదస్సులో దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వంతో మస్క్ కంపెనీ చర్చలు జరుపుతోంది.

Elon Musk's Tesla to set up its first India factory in Gujarat
Tesla First Factory in India : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టెస్లా వచ్చే ఏడాది (2024)లో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. దేశంలోని గుజరాత్‌లో తన మొదటి తయారీ ప్లాంట్‌ను స్థాపించేందుకు రెడీగా ఉంది. భారత మార్కెట్లో ఎలన్ మస్క్ ఈవీ మేకర్ మొదటి తయారీ యూనిట్ స్థాపనకు సంబంధించిన చర్చలు చివరి దశకు చేరుకున్నాయి.
త్వరలో చర్చలు ముగిసే అవకాశం ఉందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో టెస్లా తయారీ యూనిట్‌కు సంబంధించిన ప్రకటన త్వరలో వెల్లడి కానుంది. 2024 జనవరిలో జరగనున్న వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్‌లో ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉందని అహ్మదాబాద్ మిర్రర్ నివేదించింది.

Tesla factory
ప్లాంట్ లొకేషన్ ఎక్కడ ఉండొచ్చుంటే? :
నివేదిక ప్రకారం.. కొన్నేళ్లుగా గుజరాత్ వ్యాపార కార్యాకలాపాలకు ఒక వ్యూహాత్మక ప్రదేశంగా పేరుగాంచింది. రాష్ట్రం ఇప్పటికే మారుతీ సుజుకి వంటి ఆటోమేకర్ల తయారీ యూనిట్లకు నిలయంగా మారింది. అయితే, టెస్లా తయారీ ఫ్యాక్టరీకి సంబంధించి లొకేషన్ రాష్ట్రంలోని సనంద్, బెచరాజీ, ధోలేరా వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటివరకు, ఈ విషయంలో ఈవీ తయారీదారు లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇటీవల, గుజరాత్ ఆరోగ్య మంత్రి, ప్రభుత్వ ప్రతినిధి రుషికేష్ పటేల్ గుజరాత్‌లో ఎలన్ మస్క్ పెట్టుబడులపై ఆశాజనకంగా ఉన్నట్టు తెలిపారు. క్యాబినెట్ బ్రీఫింగ్‌లో ఆయన ప్రసంగిస్తూ.. గుజరాత్‌లో టెస్లా తయారీ ప్లాంట్ నెలకొల్పడానికి సంబంధించిన ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఈవీ తయారీదారుతో చర్చలు జరుపుతోందని స్పష్టం చేశారు.

Elon Musk Tesla plant
గుజరాత్‌లోనే టెస్లా ప్లాంట్ ఎందుకంటే? :
మీడియా నివేదికల ప్రకారం.. టెస్లా ఉత్పాదక కర్మాగారాన్ని నెలకొల్పడానికి గుజరాత్ ఒక అగ్ర గమ్యస్థానంగా ఉద్భవించింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల మాత్రమే కాకుండా.. దాని ఉత్పత్తుల ఎగుమతికి వీలుగా పోర్టులకు సమీపంలో ఉండటం వల్ల ఇదే ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈవీ తయారీదారు గుజరాత్‌లోని కాండ్లా-ముంద్రా ఓడరేవు నుంచి తక్కువ దూరం ఉన్నందున సనంద్ వంటి ప్రాంతాల నుంచి తమ ఉత్పత్తుల ఎగుమతిని పెంచుకోవచ్చునని భావిస్తోంది.
వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2003లో రూపొందించారు. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ పదవ ఎడిషన్.. 20ఏళ్ల వైబ్రెంట్ గుజరాత్ సక్సెస్ సమ్మిట్‌గా జరుపుకుంటుంది. ప్రధానంగా ఈ సమ్మిట్ బిజినెస్ నెట్‌వర్కింగ్, నాలెడ్జ్ షేరింగ్, సమ్మిళిత వృద్ధి, స్థిరమైన అభివృద్ధికి వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ప్రపంచ వేదికగా పనిచేస్తుంది.
Read Also : Tesla Looking to Invest in India: భారతదేశంలో ఎలోన్ మస్క్ పెట్టుబడులు..టెస్లా కార్లు, స్టార్ లింక్ ఇంటర్‌నెట్