Ethanol Blending : పాత కారు, బైక్ కొంటున్నారా జాగ్రత్త.. ఈ ఎఫెక్ట్‌తో తుక్కుకి వేయడమే..!

Ethanol Blending : 20 శాతం ఇథనాల్ (E20)తో పెట్రోల్ తప్పనిసరిపై కేంద్రం బ్లెండింగ్ ప్రోగ్రామ్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది.

Ethanol Blending

Ethanol Blending : పాత కారు, బైకు కొంటున్నారా? జర జాగ్రత్త. ముందుగా మీరు కొనే వాహనం ఏ సంవత్సరంలో తయారైందో చెక్ చేసుకోండి. ఎందుకంటే.. ఇప్పుడు ఇథనాల్‌తో (Ethanol Blending) కలిపి పెట్రోల్ విక్రయించనున్నారు. ఇథనాల్ 20శాతం కలిపిన పెట్రోల్ అమ్మకాలను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇథనాల్ కలిసిన పెట్రోల్ వాడితే అప్పటి వాహనాల ఇంజిన్లు తుక్కు పట్టడం ఖాయం.

అందుకే పాత వాహనాలు కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం బెటర్. 2023 తర్వాత తయారైన వాహనాల్లో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ వాహనాలన్నీ ఇథనాల్ కలిపిన పెట్రోల్ మీద పనిచేసే ఇంజిన్లు కలిగి ఉన్నాయి. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడినా ఇంజిన్లపై ఎలాంటి ప్రభావం ఉండదు.

2023కి ముందు వాహనాలపై తీవ్ర ప్రభావం :
అసలు సమస్య ఏంటంటే.. 2023 కన్నా ముందుగా తయారైన వాహనాలకు ఈ సౌలభ్యం అందుబాటులో లేదు. దీని కారణంగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ పోస్తే కారు లేదా బైక్ ఇంజిన్ దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. 2023కి ముందు కారు లేదా బైక్ కొంటే వాటికి రెగ్యులర్ రిపేర్ల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. డబ్బులు దండగ తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.

కారు, బైకు ఏదైనా ప్రతిసారి రిపేరింగ్ కోసం తీసుకెళ్లాల్సి వస్తుంది. దీనికి తోడు పాత వాహనాలకు రెన్యువల్ ఫీజులు కూడా భారీగా పెంచేసింది కేంద్రం . ఇలాంటి పరిస్థితుల్లో పాత వాహనాలు కొంటే డబ్బులు నీళ్లలా ఖర్చు చేయించాల్సి ఉంటుంది.

వాటికి అయ్యే రిపేరింగ్ ఖర్చులతో కొత్త వాహనాలే కొనేసుకోవచ్చు. మొన్నటివరకూ ఇథనాల్ కలిపిన పెట్రోల్ కేవలం 10శాతం మాత్రమే ఉండేది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి 20 శాతానికి పెంచింది కేంద్రం. పెట్రోల్ కన్నా ఇథనాలు చౌకైన ధరకే లభిస్తుంది.

Ethanol Blending : ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్‌‌పై సుప్రీంకోర్టులో పిల్  :

అలాంటప్పుడు ఇథనాల్‌ పెట్రోల్ కలిపినా పెట్రోలు ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదనే వాదన వినిపిస్తోంది. ఇ-20 పెట్రోలు వల్ల వాహనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, మైలేజీ కూడా తగ్గుతోందనే ఆందోళనలు ఎక్కువుతున్నాయి. ఈ క్రమంలోనే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్‌ను కేంద్రం తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టులో పిల్ (ప్రజాప్రయోజన వ్యాజ్యం) దాఖలైంది.

Read Also : Free Cloud Storage : గుడ్ న్యూస్.. ఇకపై అందరికి ఫ్రీగా డిజిలాకర్ డ్రైవ్ క్లౌడ్ స్టోరేజీ.. ఎలా క్లెయిమ్ చేయాలంటే? ఫుల్ డిటెయిల్స్..!

20 శాతం ఇథనాల్ (E20)తో కలిపిన పెట్రోల్ అమ్మకాన్ని ఇథనాల్ లేని పెట్రోల్ (E0) అందించకుండా, వినియోగదారులను E20 పెట్రోల్‌ను మాత్రమే ఉపయోగించమని బలవంతం చేయడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని న్యాయవాది అక్షయ్ మల్హోత్రా వాదించారు.

పెట్రోల్‌లో ఇథనాల్ కలుపుతారనే విషయం లక్షలాది మంది వాహనదారులకు తెలియదని, వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద బహిర్గతం చేయాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏప్రిల్ 2023కి ముందు తయారైన వాహనాలు, ఇటీవలి అనేక BS-VI మోడళ్లు కూడా E20లో నడిచేలా రూపొందించలేదన్నారు. ఇథనాల్ అధిక మొత్తంలో వాడటం వల్ల ఇంజిన్ తుప్పు పట్టడం, రబ్బరు, ప్లాస్టిక్ భాగాలకు నష్టం, ఇంధన సామర్థ్యం తగ్గడం, అధిక నిర్వహణ ఖర్చులు తలెత్తుతాయని పిటిషనర్ పేర్కొన్నారు.

E20 సమ్మతికి అనుగుణంగా డిజైన్లను స్వీకరించేందుకు ఆటోమొబైల్ తయారీదారులకు తగినంత సమయం ఇవ్వకుండా కేంద్రం ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందని కూడా ఆరోపించారు. పిల్ ప్రకారం.. తక్కువ మైలేజ్, మరమ్మతు ఖర్చులు, భీమా వివాదాలు, ఇంధన సామర్థ్యం తగ్గడం వల్ల మరిన్ని కర్భన ఉద్గారాలు పెరుగుతున్నాయని పిటిషినర్ ఎత్తిచూపారు.

సుప్రీంకోర్టు నుంచి పిల్ కోరిన అంశాలివే.. :

  • E20తో పాటు ఇథనాల్ రహిత పెట్రోల్ (E0) సరఫరా కొనసాగించాలి.
  • ఇంధన డిస్పెన్సర్‌లను ఇథనాల్ కంటెంట్‌తో స్పష్టంగా లేబుల్ చేయాలి.
  • ఇంధనం నింపే సమయంలోనే వాహనానికి అనుకూలిస్తుందా లేదా వాహనదారులకు తెలియజేయాలి.
  • వినియోగదారుల రక్షణ ప్రమాణాలను అమలు చేయాలి.
  • వాహన పనితీరుపై E20 దీర్ఘకాలిక ప్రభావాలపై అధ్యయనాన్ని నిర్వహించాలి.

E20 పెట్రోల్ ఏంటి? :
E20 పెట్రోల్ అనేది 80 శాతం పెట్రోల్‌తో కలిపిన 20 శాతం ఇథనాల్‌ కలిగిన ఇంధనం. ప్రధానంగా చెరకు, ఇతర వ్యవసాయ ఉప ఉత్పత్తుల నుంచి పొందే జీవ ఇంధనమే ఇథనాల్.. ఇది పెట్రోల్ కన్నా బాగా మండుతుంది.

వాహనాల నుంచి కాలుష్య ఉద్గారాలను కూడా భారీగా తగ్గిస్తుంది. దేశంలోని ఆటోమేకర్లు ఇప్పటికే ఈ ఇంధనానికి అనుకూలమైన ఇంజిన్లను తయారు చేస్తున్నారు. అదే పాత వాహనాల ఇంజిన్లలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ పోస్తే ఇంజిన్ తుప్పు పట్టిపోతాయి.