Fabulous Friday: ఇవాళ ఒక్క రోజే..పెట్టుబడిదారులకు 7లక్షల కోట్ల లాభం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో స్టాక్ మార్కెట్‌లో ఫుల్ జోష్ పెంచాయి. అనారోగ్య ఆర్థిక వ్యవస్థను పెంచడానికి దేశీయ కంపెనీలకు సెస్,సర్ చార్జీలు మొత్తం కలిపి కార్పొరేట్ ట్యాక్స్ ను 25.17శాతానికి తగ్గిస్తూ ఇవాళ ఆమె చేసిన ప్రకటనతో BSE-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్.. ఒక్క రోజులోనే 1.45లక్షల కోట్ల నుంచి రూ .6.82 లక్షల కోట్లకు పెరిగింది. దలాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులకు ఇది అద్భుతమైన శుక్రవారంగా మిగిలింది. గత పదేళ్లలో ఇవాళే అత్యధికంగా మదుపరులు లాభపడ్డారు. దీపావళి ముందుగానే వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ రోజు ఆర్థికమంత్రి చేసిన ప్రకటనతో దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. 2017లో కూడా అమెరికాలో ట్రంప్ సర్కార్ ఇలాగే కార్పొరేట్ ట్యాక్స్ ను తగ్గిస్తున్నట్లు ప్రకటన చేసిన తర్వాత ఆ దేశ ఆర్థికవ్యవస్థ మరింత బలమైనదిగా మారిందని కార్వీ స్టాక్ బ్రోకింగ్ సీఈవో రాజీవ్ సింగ్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు