×
Ad

7 Seater Family SUVs : ఫ్యామిలీ కస్టమర్లకు పండగే.. హై పర్ఫార్మెన్స్‌తో 5 సరికొత్త 7 సీటర్ SUV మోడల్స్ వచ్చేస్తున్నాయ్..

7 Seater Family SUVs : హై పర్ఫార్మెన్స్‌తో కొత్త SUV మోడల్ కార్లు భారత మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ఈ కొత్త మోడళ్లలో ఫ్యామిలీ కస్టమర్ల కోసం ఏడు సీట్లతో ఆకర్షణీయంగా ఉండనున్నాయి.

7 Seater Family SUVs (Image Credit To Original Source)

  • భారత మార్కెట్లోకి రాబోతున్న కొత్త SUV కార్లు
  • 2026లో లాంచ్ కానున్న 5 కొత్త పవర్‌ఫుల్ 7-సీటర్ ఎస్‌యూవీలు
  • సబ్-4 మీటర్ ఎస్‌యూవీలు, మరికొన్ని 7 సీట్లతో భారీ SUVలు

7 Seater Family SUVs : ఫ్యామిలీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. అతి త్వరలో భారత మార్కెట్లోకి హై పర్ఫార్మెన్స్‌తో 7 సీటర్ కొత్త ఎస్‌యూవీ కార్లు రాబోతున్నాయి. ఈ కొత్త మోడళ్లలో కొన్ని సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రానున్నాయి. మరికొన్ని 7 సీట్లతో భారీ SUVలుగా లాంచ్ కానున్నాయి.

ఈ ఎస్‌యూవీ మోడళ్లు వినియోగదారులకు పెట్రోల్,డీజిల్ ఇంజన్లు, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ల ఆప్షన్లను అందిస్తాయి. ఈ మోడళ్లలో చాలా వరకు ఇప్పటికే ఉన్న మోడళ్ల కు అప్‌డేట్ వెర్షన్‌లు. అయితే, కొన్ని పూర్తిగా కొత్త మోడల్స్ ఉన్నాయి.. ఈ కార్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

వోక్స్‌వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్ :
వోక్స్‌వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్ బ్రాండ్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలో టిగువాన్ R-లైన్ ఎస్‌యూవీతో వస్తుంది. ఆర్-లైన్ బ్యాడ్జ్‌ స్టైలింగ్‌తో ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ బ్రాండ్‌ను ప్రీమియం మూడు వరుసల SUV విభాగంలో తీసుకువస్తుంది. అతి త్వరలో CKD (కస్టమర్ కంట్రోల్డ్ డెలివరీ)గా ప్రారంభం కానుంది. 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఇంజిన్ 204hp పవర్ 320Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

ఎంజీ మెజెస్టర్ :
ఎంజీ మెజెస్టర్‌ కారు ఫస్ట్ టైమ్ 2025 ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఆవిష్కరించారు. ఇప్పుడు, కంపెనీ ఫిబ్రవరి 12న భారత మార్కెట్లో ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. ఈ మోడల్ ఆటోమేకర్ లైనప్‌లోని గ్లోస్టర్‌ను రిప్లేస్ చేసే అవకాశం ఉంది.

7 Seater Family SUVs (Image Credit To Original Source)

అనేక ఫీచర్లు ఆఫ్-రోడ్ సామర్థ్యాలతో అందిస్తుందని భావిస్తున్నారు. 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పవర్ అందిస్తుంది. 210hp 478Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

నిస్సాన్ 7-సీటర్ SUV కారు :

నిస్సాన్ ఇండియాలో టెక్టన్ SUV, గ్రావైట్ MPV మోడల్ అతి త్వరలో లాంచ్ చేయనుంది. ఆ తర్వాత కంపెనీ CMF-B ప్లాట్‌ఫామ్ ఆధారంగా కొత్త 7-సీటర్ ఎస్‌యూవీని రిలీజ్ చేయనుంది. ఈ కారు ఈ ఏడాది చివరి నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ :
2022లో మహీంద్రా స్కార్పియో N మోడల్ కారు భారత మార్కెట్లో లాంచ్ అయింది. అప్పటి నుంచి ఈ ఎస్‌యూవీ అద్భుతమైన అమ్మకాలతో దూసుకెళ్లింది. కానీ, ఇప్పుడు ఆ ప్లేసులో ఫేస్ లిఫ్ట్ మోడల్ రాబోతోంది. ఈ మోడల్ టెస్ట్ మ్యూల్స్ చాలాసార్లు కనిపించాయి డిజైన్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని భావిస్తున్నారు. ప్రస్తుత మోడల్ మాదిరిగానే అదే ఇంజిన్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉంది.

రెనాల్ట్ బోరియల్ :
భారత మార్కెట్లో కొత్త జనరేషన్ డస్టర్‌ లాంచ్ తర్వాత రెనాల్ట్ 7-సీటర్ వెర్షన్ బోరల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఈ SUV మోడల్ కారు డస్టర్ మాదిరిగానే సేమ్ ఇంజిన్‌ ఆప్షన్‌తో వస్తుంది. అలాగే కొన్ని స్పెషల్ డిజైన్ అంశాలు కూడా ఉన్నాయి. లెవల్ 2 అడాస్, 360-డిగ్రీ కెమెరాతో అనేక ఇతర ఫీచర్లు కూడా ఉంటాయని భావిస్తున్నారు.