Flipkart Big Bang Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్.. ఐఫోన్ 16, పిక్సెల్ 10, శాంసంగ్ గెలాక్సీ S25పై భారీ డిస్కౌంట్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు!
Flipkart Big Bang Diwali Sale 2025 : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ రాబోతుంది. ఐఫోన్ 16, పిక్సెల్ 10, గెలాక్సీ S25పై డిస్కౌంట్లను అందిస్తోంది.

Flipkart Big Bang Diwali Sale 2025
Flipkart Big Bang Diwali Sale 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి అదిరిపోయే న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్ సమయంలో మీకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్ డీల్ మిస్ అయ్యారా? అయితే డోంట్ వర్రీ.. మీకోసం మరో కొత్త సేల్ రాబోతుంది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి సేల్ మాదిరిగానే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులైతే అందరి కన్నా 24 గంటల ముందుగానే ఈ డీల్స్ యాక్సెస్ చేయొచ్చు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ (Flipkart Big Bang Diwali Sale 2025) సమయంలో కస్టమర్లు ఐఫోన్ 16 ప్రో మాక్స్, పిక్సెల్ 10, శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, గెలాక్సీ S25 వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై క్రేజీ డీల్స్ పొందవచ్చు. అంతేకాదు.. ఫ్లిప్‌కార్ట్ అనేక కీలక ఆఫర్లను కూడా ప్రకటించింది. ఇంతకీ ఏయే ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉండనున్నాయో ఓసారి లుక్కేయండి.
ఫ్లిప్‌కార్ట్‌లో టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ :
ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ రూ.56వేల లోపు ధరకు లభిస్తుంది. ఇప్పుడు, ఫ్లిప్‌కార్ట్ మరో పండగ సేల్‌తో వస్తోంది. కొత్త ఐఫోన్ కొనేందుకు ఇదో అద్భుతమైన అవకాశం. కచ్చితమైన ధర, బ్యాంక్ ఆఫర్లను ప్రస్తుతానికి ప్రకటించలేదు. భారత మార్కెట్లో ఐఫోన్ 16 రూ.1,44,990 ధరకు లాంచ్ కాగా, సేల్ సందర్భంగా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ రూ.1,03,900కి అందుబాటులో ఉండొచ్చు. అదేవిధంగా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ రూ.1,03,900కి అందుబాటులో ఉంటుందని అంచనా.
అదేవిధంగా, రూ.49,999 ధరకు లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 9a బ్యాంక్ ఆఫర్లతో రూ.40వేల లోపు ధరకు లభించనుంది. గూగుల్ పిక్సెల్ 10 ధర రూ.79,999 నుంచి రూ.67,999కు తగ్గింపు పొందనుంది. పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ లాంచ్ ధర రూ.1,72,999 నుంచి రూ.99,999కు తగ్గవచ్చు.
బ్యాంక్ డిస్కౌంట్లతో శాంసంగ్ గెలాక్సీ S25 ధర రూ.68,999కి ఉంటుందని అంచనా. అదనంగా, శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కూడా భారీ ధర తగ్గింపుతో అందుబాటులో ఉండొచ్చు. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ సమయంలో కస్టమర్లు వరుసగా రూ.20,999, రూ.24,999, నథింగ్ ఫోన్ 3a, నథింగ్ ఫోన్ 3a ప్రోలపై కూడా భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.