Flipkart Big Billion Days
Flipkart Big Billion Days : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? అయితే ఈ ఆఫర్లు అసలు వదులుకోవద్దు. అతి త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ సందర్భంగా ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు అత్యంత సరసమైన ధరకే లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ ఆఫర్లను రివీల్ చేసింది. ఐఫోన్ 16 ధర చౌకైన ధరకే సొంతం చేసుకోవచ్చు.
అదనంగా, ఐఫోన్ సిరీస్ ప్రో వేరియంట్‌లు కూడా తగ్గింపు (Flipkart Big Billion Days) ధరకే లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రోను రూ.70వేల కన్నా తక్కువకు విక్రయిస్తోంది. ఈ డీల్‌లో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ రూ. 90వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఈ అదిరిపోయే డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌పై ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో సేల్ ప్రారంభ ధర రూ. 69,999 అవుతుంది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 89,999గా ఉంది. మీరు క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ. 5వేలు తగ్గింపు లభిస్తుంది.
బ్యాంక్ ఆఫర్లతో మరిన్ని తగ్గింపులు పొందవచ్చు. ఐఫోన్ 16 ప్రో అసలు ధర రూ. 1,12,900 ఉండగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ధర రూ. 22,901 తగ్గింది. ఐఫోన్ ప్రో మ్యాక్స్ మోడల్ రూ. 1,37,900కి విక్రయించవచ్చు. ధర రూ. 47,901 తగ్గింపు పొందవచ్చు.
బ్యాంక్ కార్డులపై డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. ఈ ఆఫర్ సమయంలో యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులు ఇన్‌స్టంట్ 10శాతం తగ్గింపు పొందవచ్చు. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్‌పై ఇన్‌స్టంట్ 10శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ సేల్ సమయంలో ఐఫోన్ల ధరలు భారీగా తగ్గుతాయి.
ఈ ఐఫోన్లపై డిస్కౌంట్లు :
ఆపిల్ ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ.39,999, ప్రో వేరియంట్‌లతో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఐఫోన్ ధర రూ.52,990కు లభ్యం కానుంది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.51,999 నుంచి అందుబాటులో ఉంటుంది.