Flipkart Big Billion Days sale starts soon, check out best phone deals
Flipkart Big Billion Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) త్వరలో ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ డేట్ ఇంకా వెల్లడి చేయలేదు. చాలా మంది కస్టమర్‌లను ఆకర్షించడానికి కొన్ని ఫోన్ డీల్స్ వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో Pixel 6a, Oppo Reno 8, Nothing Phone (1) వంటి డివైజ్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందించనుంది.
చాలా డీల్‌లు బ్యాంక్ లేదా ప్రీపెయిడ్ ఆర్డర్‌లపై ఆధారపడి ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ కొన్ని ఫోన్‌లపై నేరుగా డిస్కౌంట్ కూడా అందించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్ అందించనుంది.
Flipkart Big Billion Days sale starts soon, check out best phone deals
Redmi Note 10 Pro Max ధర రూ. 14,999కి అందుబాటులో ఉండొచ్చునని నివేదిక వెల్లడించింది. ఈ డివైజ్ 108-MP వెనుక కెమెరా ఉంది. అద్భుతమైన ఫోటోలను తీయగలదు. AMOLED స్క్రీన్, 5020mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 732G మరిన్నింటిని కలిగి ఉంది.
Realme Narzo 50 బ్యాంక్ కార్డ్ ఆఫర్‌లతో సుమారు రూ. 10,999 ధర ఉంటుంది. ఐఫోన్ 11 (iPhone 11), ఐఫోన్ 12 (iPhone 12), ఐఫోన్ 13 (iPhone 13) ధరలు ఇప్పటికీ వెల్లడించలేదు. అయితే ఈ డివైజ్‌లపై కూడా భారీ డిస్కౌంట్‌ను అందిస్తామని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.
ఫ్లిప్‌కార్ట్ సేల్ పేజీలో నథింగ్ ఫోన్ (1)ని ధర రూ. 33,999 నుంచి రూ. 28,999కు తగ్గింది. అంటే.. ఈ సేల్ ఈవెంట్ రూ. 5,000 డిస్కౌంట్ అందిస్తుంది. Oppo Reno 8 5G ధర రూ. 26,999కి తగ్గనుంది. మీరు బ్యాంక్ ఆఫర్‌లతో ఈ ధరకు కొనుగోలు చేయవచ్చు. Infinix Hot 12 Play ధర రూ. 7,199కి సేల్‌కు అందుబాటులో ఉండనుంది. అయితే Moto G52 రూ. 12,599కి అందుబాటులో ఉండనుంది.
Flipkart Big Billion Days sale starts soon, check out best phone deals
Pixel 6a భారీ డిస్కౌంట్ కూడా అందించనుంది. ఫ్లిప్‌కార్ట్ డీల్ లిస్టు ప్రకారం.. 5G ఫోన్ ధర రూ.27,699కి అందుబాటులో ఉంటుంది. వాస్తవానికి భారత మార్కెట్లో రూ. 43,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుంది. Flipkart Pixel 6aపై రూ. 16,300 డిస్కౌంట్ అందించనుంది.
ఇదే ఫ్లిప్ కార్ట్ అందించే భారీ డిస్కౌంట్ ఆఫర్. అయితే, ప్లాట్‌ఫారమ్ రూ. 16,300 ఫ్లాట్ డిస్కౌంట్ ఇచ్చేలా కనిపించడం లేదు. ఈ-కామర్స్ దిగ్గజం కచ్చితమైన వివరాలను అందించలేదు. కానీ, ఆఫర్ బ్యాంక్ కార్డ్‌లపై ఆధారపడి ఉంటుందని హ్యాండ్‌సెట్‌పై కూడా డిస్కౌంట్ ఉండే అవకాశం ఉంది.