Flipkart Loans : గుడ్ న్యూస్.. మీకు అకౌంట్ ఉందా? ఇక ఫ్లిప్‌కార్ట్ నుంచి నేరుగా లోన్లు తీసుకోవచ్చు..!

Flipkart Loans : ఫ్లిప్‌కార్ట్ ఖాతాదారులు నేరుగా లోన్లు పొందవచ్చు. NBFC లైసెన్స్ పొందిన మొదటి భారతీయ ఈ-కామర్స్‌గా నిలిచింది.

Flipkart Loans

Flipkart Loans : ఫ్లిప్‌కార్ట్ అకౌంట్ వాడుతున్నారా? ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఈ-కామర్స్ ప్లాట్ ఫారం నుంచి నేరుగా రుణాలు పొందవచ్చు. వాల్ మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ ఇకపై లోన్లు కూడా అందించనుంది.

Read Also : Fixed Deposit : మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా? బ్యాంక్ FDలపై తగ్గనున్న వడ్డీ రేట్లు.. కస్టమర్లు ఏం చేయాలంటే?

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నుంచి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (NBFC) లైసెన్సును అందుకుంది. తద్వారా ఫ్లిప్‌కార్ట్ నేరుగా ఖాతాదారులు, ప్లాట్‌ఫాం ద్వారా వస్తువులు విక్రయించే కంపెనీలకు రుణాలు మంజూరు చేయనుంది.

ఫ్లిప్‌కార్ట్ ఇదే ఫస్ట్ టైమ్  :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ NBFC, బ్యాంకుల బాగస్వామ్యంతో (Flipkart Loans) లోన్లు మంజూరు చేయనుంది. ఈ-కామర్స్ సంస్థకు ఆర్బీఐ NBFC లైసెన్స్ జారీ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఖాతాదారులు, డిపాజిట్లు, అమ్మకందారులకు మాత్రమే రుణాలు మంజూరు చేయాలని ఆర్బీఐ లైసెన్స్ డాక్యుమెంట్‌లో స్పష్టం చేసింది.

రాబోయే నెలల్లో ఫ్లిప్‌కార్ట్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, NBFC ప్రారంభించనుంది. ఫ్లిప్‌కార్ట్ 2022లోనే ఆర్బీఐకి ఈ లైసెన్స్ కోసం అప్లయ్ చేసింది.

Read Also : Credit Cards : ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉన్నాయా? క్యాన్సిల్ చేసే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!

ఫ్లిప్‌కార్ట్ మాదిరిగానే అమెజాన్. ఇన్ కూడా అదే పనిచేస్తోంది. బెంగళూరు కేంద్రంగా ‘యాక్సియో’ అనే NBFC కొనుగోలు చేసింది. ఆర్బీఐ నుంచి ఇంకా అనుమతి రాలేదు.