Vivo T3 Pro 5G
Vivo T3 Pro 5G : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వివో T3 ప్రో 5G ఫోన్ ధర భారీగా తగ్గింది. కర్వడ్ ఎడ్జ్ డిస్ప్లేతో మీ బడ్జెట్ ధరలోనే లభ్యమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ లో (Vivo T3 Pro) అనేక ఆఫర్‌లు, డీల్స్ ద్వారా చౌకౌన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. మీరు కూడా ఈ వివో ఫోన్ కొనేందుకు ఆసక్తిగా ఉంటే ధర ఎంత తగ్గింపు పొందిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వివో T3 ప్రో 5G ఫ్లిప్‌కార్ట్ ఆఫర్, డిస్కౌంట్లు :
ధర, ఆఫర్ల విషయానికి వస్తే.. వివో T3 ప్రో ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ. 31,999కు పొందవచ్చు. ఫ్లిప్ కార్ట్ నుంచి 22శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దాంతో వివో ఫోన్ ధర రూ. 24,999 అవుతుంది. బ్యాంక్ ఆఫర్ కింద HDFC, Axis, SBI బ్యాంక్ కార్డులపై రూ. 3500 తగ్గింపు పొందవచ్చు. అదేవిధంగా, రూ. 24,350 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 3584 నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
వివో T3 ప్రో 5G స్పెసిఫికేషన్లు :
ఈ వివో ఫోన్ 6.77 అంగుళాల ఫుల్ హెచ్‌డీ అమోల్డ్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. టాప్ బ్రైట్‌నెస్ 4500 నిట్స్, మల్టీ టాస్కింగ్ కోసం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ కలిగి ఉంది. ఈ వివో ఫోన్ ఆండ్రాయిడ్ 14OSలో రన్ అవుతుంది.
8GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉన్నాయి. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 16MP కెమెరా కూడా ఉంది. అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. 5500mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు ఇతర ఫీచర్లలో కూడా లభిస్తుంది.