ఆన్‌లైన్ షాపింగ్ ప్రేమికుల కోసం బిగ్ బిలియన్ డేస్.. తేదీలు, ఆఫర్లు ఇవే!

  • Publish Date - October 3, 2020 / 04:38 PM IST

Flipkart’s ‘The Big Billion Days’: ఆన్‌లైన్ షాపింగ్ అసలు మజా మొదలవబోతుంది. ఆన్‌లైన్ కొనుగోలుదారులు ఎదరు చూస్తున్న ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రకటించింది. భారీ డిస్కౌంట్ సేల్‌గా ఫ్లిప్‌కార్ట్.. ఇండియాలోనే బిగ్గెస్ట్ సేల్‌గా ఫ్లిప్‌కార్ట్ ప్రచారం చేస్తున్న బిగ్ బిలియన్ డేస్ తేదీలను ప్రకటించింది. ప్రతీ ఏడాది దసరా, దీపావళి పండుగ సీజన్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్‌ నిర్వహిస్తూ ఉండగా.. ఫ్లిప్‌కార్ట్.. భారీ ఆఫర్లు, డిస్కౌంట్లతో ఈ సేల్ మొదలు పెట్టేందుకు సిద్ధం అయ్యింది.

ఈ సేల్‌లో డిస్కౌంట్లు అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI, పేటీఎంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది ఫ్లిప్‌కార్ట్. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనేవారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, హోల్ ఉపకరణాలు మరియు ఫ్యాషన్‌తో సహా దాదాపు అన్ని ఐటెమ్స్‌లో గొప్ప తగ్గింపులు, గొప్ప ఒప్పందాలను అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. అక్టోబర్ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ సేల్ జరగనుంది.



దీని కింద వినియోగదారులకు కచ్చితమైన క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. వినియోగదారులకు డెబిట్ కార్డ్ emi ఎంపికతో పాటు అనేక పెద్ద బ్యాంకుల కార్డుల ద్వారా వడ్డీ లేని వాయిదాల ఎంపిక కూడా లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్ ద్వారా, మీరు అమ్మకం సమయంలో షాపింగ్ చేసి డబ్బులను తరువాత చెల్లించవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ అమ్మకం సమయంలో శామ్సంగ్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ఆఫర్‌ను తీసుకువస్తోంది. ఇందులో కస్టమర్ 70 శాతం ధర చెల్లించి శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. 1 సంవత్సరం తరువాత కొత్త స్మార్ట్‌ఫోన్‌కు స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేసుకోవచ్చు. అతను స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేయకూడదనుకుంటే, మిగిలిన 30 శాతం చెల్లించవచ్చు. ఈసారి వినియోగదారులు ఎక్స్ఛేంజ్ కోసం అనేక కొత్త ఎంపికలను పొందబోతున్నారు. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో, వినియోగదారులు తమ ఫీచర్ ఫోన్‌లను స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఎక్స్‌ఛేంజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, కస్టమర్లు ఎక్స్‌ఛేంజ్‌లో ప్రత్యేక డిస్కౌంట్లను పొందవచ్చు.



ఇక ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాంటి ప్రముఖ బ్యాంకులతో పాటు బజాజ్ ఫిన్‌సర్వ్ నుంచి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. అంటే ఈ కార్డులతో నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కొంటే వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. డెబిట్ కార్డుతో కొనేవారు కూడా ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ప్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కి ఎర్లీ పాస్ ప్రకటించింది ప్లిప్‌కార్ట్. అంటే ప్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్స్‌ని మిగతా కస్టమర్ల కన్నా ముందే పొందొచ్చు.

ఇక టీవీలు, హోమ్ అప్లయెన్సెస్‌పై 80శాతం వరకు తగ్గింపు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. నో కాస్ట్ ఈఎంఐ, కంప్లీట్ అప్లయెన్స్ ప్రొటెక్షన్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై 80శాతం వరకు తగ్గింపు ఉంటుంది. ఇక ఫ్యాషన్ వేర్‌పై 60 నుంచి 80 శాతం వరకు తగ్గింపు ప్రకటించింది. బ్యూటీ, ఫుడ్, టాయ్స్, బేబీ కేర్ ప్రొడక్ట్స్ రూ.79 నుంచి ప్రారంభమౌతాయి. హోమ్ అండ్ కిచెన్ ప్రొడక్ట్స్ రూ.49 నుంచి మొదలవుతాయి. ఫర్నీచర్‌పై 50 నుంచి 80 శాతం తగ్గింపు పొందొచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్ సొంత బ్రాండ్లపై 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవి కాకుండా మహా డ్రాప్, క్రేజీ డీల్స్, రష్ హవర్స్ లాంటి స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సూపర్ కాయిన్స్ కలెక్ట్ చేసేవారు కాయిన్స్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. బోనస్ కాయిన్స్ గెలుచుకోవచ్చు.



ఇక ఇప్పటికే అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రకటించింది. అమెజాన్ కూడా సేల్ ఎప్పుడు నిర్వహించనుందో తేదీలను ప్రకటించాల్సి ఉంది. అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ, అలియా భట్, రణబీర్ కపూర్, సుదీప్ కిచ్చా, మరియు మహేష్ బాబులతో సహా పలువురు ప్రముఖులతో ‘ది బిగ్ బిలియన్ డేస్’ కార్యక్రమంకు సంబంధించిన సృజనాత్మక అడ్వర్టైజ్‌మెంట్లను ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే విడుదల చేసింది. ఈ ‘The Big Billion Days’పై ఆన్‌లైన్ షాపింగ్ ప్రేమికుల్లో చాలా అంచనాలు ఉన్నాయి.