2026 Financial Reforms (Image Credit to Original Source)
Financial Reforms 2026 : పన్నుచెల్లింపుదారులు, సామాన్యలుకు బిగ్ అలర్ట్.. జనవరి 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేశాయి. ఆర్థికపరమైన లావాదేవీల నుంచి బ్యాంకులు, ప్రభుత్వ పథకాల వరకు అన్నింటిపై కొత్త నిబంధనలు వర్తిస్తాయి. రైతులు, ఉద్యోగులు, యువత, సాధారణ ప్రజలపై ప్రభావం పడుతుంది. ముఖ్యమైన రంగాల్లో బ్యాంకింగ్ నిబంధనలు, ఇంధన ధరలు, వివిధ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. 2026 నుంచి అమల్లోకి వచ్చిన కీలక ఆర్థిక సంస్కరణలకు సంబంధించి ఈ మార్పుల గురించి ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం.
1. 8వ వేతన సంఘం :
2026 ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు. 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. 8వ వేతన సంఘం కింద ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు జీతాలకు సంబంధించి కేంద్రం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. 8వ వేతన సంఘంలో ఎంత పెరుగుదల ఉంటుందనడానికి ఇంకా కచ్చితమైన గణాంకాలు లేవు. కానీ, ప్రాథమికంగా 20శాతం నుంచి 35శాతం పెరగొచ్చని అంచనా.
6వ వేతన సంఘంలో దాదాపు 40శాతం పెరుగుదల ఉంది. 7వ వేతన సంఘం 2.57 ఫిట్‌మెంట్ కారకంతో 23 శాతం 25శాతం ప్రభావాన్ని చూపింది. 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.4 నుంచి 3.0 మధ్య ఉండవచ్చు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులు, పెన్షనర్లు పెరిగిన మొత్తంపై బకాయిలను పొందే అవకాశం ఉంది.
Read Also : UPI Payments : ఇంటర్నెట్ తో పనిలేదు భయ్యా! ఇలా ఈజీగా యూపీఐ పేమెంట్లు చేయొచ్చు, యూపీఐ ఫుల్ గైడ్ మీకోసం
2. CNG, PNG ధరలు తగ్గుతాయి :
యూనిఫైడ్ టారిఫ్ సిస్టమ్ కింద ఛార్జీలలో ఈ మార్పు CNG, PNG ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సీఎన్‌జీ ధరలు కిలోకు దాదాపు రూ.1.25 నుంచి రూ.2.50 వరకు తగ్గుతుంది. అంతేకాదు… PNG ధరలలో SCMకి రూ. 0.90 నుంచి రూ. 1.80 వరకు రిలీఫ్ ఉండొచ్చు. PNG ధర తగ్గితే రోజూ PNGపై వాహనాలు నడిపేవారు, వంట గ్యాస్ వాడేవారు బెనిఫిట్స్ పొందవచ్చు.
3. బ్యాంకు వడ్డీ రేట్లు :
డిసెంబర్ మానిటరీ పాలసీ సమావేశంలో ఆర్బీఐ రెపో రేటును 0.25 శాతం తగ్గించింది. ఈ తగ్గింపు రుణ వడ్డీ రేట్లను నేరుగా ప్రభావితం చేస్తుంది. తక్కువ వడ్డీ రేట్లు మీ నెలవారీ ఈఎంఐ పేమెంట్లను తగ్గిస్తాయి. రెపో రేటు తగ్గిన తర్వాత బ్యాంకులు వడ్డీ రేట్లను ఎంత తగ్గిస్తాయి అనేది ఆయా బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది.
ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ ఏజెన్సీ ఎల్‌పీజీ సిలిండర్ల ధరను సమీక్షించి సవరిస్తుంది. ఈ రోజు గ్యాస్ ఏజెన్సీ సిలిండర్ ధరల్లో మార్పులు చేసింది. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో మార్పులు లేవు. 19కిలోల కమర్షియల్ సిలిండర్ పై ఏకంగా రూ.111 పెరిగింది.
5. సోషల్ మీడియాలో మార్పులు :
మీడియా రిపోర్టులను పరిశీలిస్తే.. 2026లో చిన్నపిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నియంత్రించేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఈ నియమాలు 16 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వర్తిస్తాయి. ఇకపై అభ్యంతకరమైన కంటెంట్‌ను చూడలేరు.
LPG New Rules (Image Credit to Original Source)
6. కొత్త ఆదాయపు పన్ను బిల్లు అమలు :
2025 లో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు అనేక టాక్స్ రిలీఫ్ అందించింది. గత ఏడాదిలో ప్రభుత్వం వస్తువులు, సేవలపై పన్ను అయిన జీఎస్టీని తగ్గించింది. దాంతో పాటు కొత్త ఆదాయపు పన్ను బిల్లు కూడా ఆమోదించింది. ఈ బిల్లు అనేక పన్ను సంబంధిత మార్పులను ప్రవేశపెడుతుంది. ఏప్రిల్ 2026లో అమల్లోకి వస్తుంది.
7. పీఎం-కిసాన్ కోసం కొత్త రైతు గుర్తింపు కార్డులు :
భారత ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కోసం కొత్త రైతు ఐడీ సిస్టమ్ ప్రవేశపెట్టింది. తద్వారా జనవరి 1, 2025 నుంచి కొత్త దరఖాస్తుదారులకు తప్పనిసరి చేసింది. ఈ డిజిటల్ ఐడీ రైతుల భూమి రికార్డులు, పంట సమాచారం, ఆధార్, బ్యాంక్ వివరాలను ఇంటిగ్రేట్ చేస్తుంది. పారదర్శకతను కలిగి ఉంటుంది. ఇప్పటికే ఉన్న లబ్ధిదారులు ప్రభావితం కారు. కానీ, కొత్త దరఖాస్తుదారులు రూ.6వేలు కోసం రిజిస్టర్ చేసుకోవాలి.
జనవరి 2026 నుంచి పన్ను చెల్లింపుదారులు రెన్యువల్ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫారమ్‌ను పొందవచ్చు. ఈ ఫారమ్ బ్యాంకింగ్, ఖర్చుల వివరాలతో ముందుగానే ఫిల్ చేసి ఉంటుంది. ఐటీఆర్ దాఖలు ప్రక్రియ మరింత ఈజీ అవుతుంది. ఐటీఆర్ దాఖలు సమయంలో తలెత్తే లోపాలు తగ్గుతాయి.
9.మెరుగైన డిజిటల్ పేమెంట్ సెక్యూరిటీ :
సైబర్ మోసాలను అరికట్టడానికి బ్యాంకులు యూపీఐ లావాదేవీలపై కఠినమైన చెకింగ్స్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లకు మరింత SIM వెరిఫికేషన్ నిబంధనలను అమలు చేస్తాయి.
10.వారంవారీగా క్రెడిట్ స్కోర్ అప్‌డేట్స్ :
ప్రస్తుత 15-రోజుల సైకిల్‌కు బదులుగా క్రెడిట్ బ్యూరోలు ఇప్పుడు ప్రతి వారం కస్టమర్ డేటాను రిఫ్రెష్ చేస్తాయి. రుణ చెల్లింపులు లేదా డిఫాల్ట్‌లు మీ క్రెడిట్ స్కోర్‌లో చాలా వేగంగా అప్ డేట్ అవుతాయి. మీకు లోన్ అర్హత ఉందో లేదో నిర్ణయిస్తాయి.
11.పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ తప్పనిసరి :
మీ పాన్ కార్డు, ఆధార్ కార్డులను లింక్ చేయడం తప్పనిసరి. డిసెంబర్ 31, 2025 వరకు ఈ పనిని ఫ్రీగా పూర్తి చేయొచ్చు. ఒకవేళ చేయకపోతే ఇప్పుడు లింక్ చేయడానికి మీరు పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. మీరు ఇంకా ఈ ప్రాసెస్ చేయకపోతే వెంటనే పూర్తి చేయండి.
12. జనవరి 1 నుంచి వారికి రేషన్ బంద్ :
రేషన్ కార్డుదారులు డిసెంబర్ 31 లోపు తమ రేషన్ కార్డు e-KYC పూర్తి చేయనివారికి జనవరి 1 నుంచి రేషన్ పొందలేరు. మొబైల్ ద్వారా కూడా ఈ పని పూర్తి చేయవచ్చు.