UPI Payments : ఇంటర్నెట్‌తో పనిలేదు భయ్యా! ఇలా ఈజీగా యూపీఐ పేమెంట్లు చేయొచ్చు, యూపీఐ ఫుల్ గైడ్ మీకోసం

UPI Payments : మీ ఫోన్ నుంచి *99# డయల్ చేయండి. యూపీఐ పేమెంట్లు ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ లేకుండానే చేసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ తెలుసుకోండి.

UPI Payments : ఇంటర్నెట్‌తో పనిలేదు భయ్యా! ఇలా ఈజీగా యూపీఐ పేమెంట్లు చేయొచ్చు, యూపీఐ ఫుల్ గైడ్ మీకోసం

UPI Payments Offlines (Image Credit to Original Source)

Updated On : January 1, 2026 / 4:51 PM IST
  • యూపీఐ పేమెంట్లకు ఇంటర్నెట్ అవసరం లేదు
  • స్మార్ట్ ఫోన్ లేకుండా కూడా ఫీచర్ ఫోన్లతో పేమెంట్లు ఈజీ
  • మొబైల్ నెట్ వర్క్ అవసరం, యూపీఐ పిన్ కూడా తప్పనిసరి

UPI Payments : యూపీఐ యూజర్ల కోసం అద్భుతమైన టిప్.. ప్రస్తుత రోజుల్లో యూపీఐ పేమెంట్ల వినియోగం భారీగా పెరిగింది. ప్రత్యేకించి ఆన్‌లైన్ పేమెంట్ల కోసం యూపీఐపైనే అందరూ ఆధారపడుతున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ దగ్గర నుంచి కిరాణా సామాగ్రి వరకు అన్నింటికి యూపీఐనే తెగ వాడేస్తున్నారు. సాధారణంగా యూపీఐ పేమెంట్లు ఆన్ లైన్ ద్వారానే ఎక్కువగా చేస్తుంటారు. కానీ, యూపీఐ పేమెంట్లు ఆఫ్ లైన్‌లో కూడా చేయొచ్చు అని మీకు తెలుసా?

ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెెళ్లినప్పుడు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండదు. ఇలాంటి సందర్భాల్లో యూపీఐ పేమెంట్లు చేయడం చాలా కష్టం. అందుకే, మీకు ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఈజీగా ఇంటర్నెట్ పేమెంట్లు చేసుకోవచ్చు.

ఫీచర్ ఫోన్‌తో కూడా పేమెంట్ చేయొచ్చు : 

మరో విషయం ఏమిటంటే.. స్మార్ట్ ఫోన్ ఉంటేనే యూపీఐ పేమెంట్లు చేయగలమా? అంటే అలా కాదు.. నార్మల్ ఫీచర్ ఫోన్ చేతిలో ఉన్నా కూడా సులభంగా యూపీఐ పేమెంట్లు చేయొచ్చు. మీరు చేయాల్సిందిల్లా సింపుల్ ట్రిక్ ట్రై చేయడమే. మీ ఫోన్ నుంచి *99# అనే స్పెషల్ కోడ్‌ డయల్ చేయండి. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ రెండూ లేకున్నా కేవలం ఫీచర్ ఫోన్ ద్వారా పేమెంట్లు ఎలా చేయాలో పూర్తి ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం.

UPI Payment

UPI Payment (Image Credit to Original Source)Read Also : Free AI Tools : 2026లో గూగుల్ జెమిని, పెర్ప్లెక్సిటీ, చాట్ జీపీటీ ఫ్రీగా ఎలా పొందాలో తెలుసా? ఇదిగో సింపుల్!

మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసిన మొబైల్ నంబర్ నుంచి మాత్రమే యూపీఐ పేమెంట్లు చేయవచ్చు. ఇంటర్నెట్ స్మార్ట్‌ఫోన్ లేకున్నా యూపీఐ పిన్ ఉండాలి. లేదంటే పేమెంట్ ప్రాసెస్ చేయలేరు.

ఫోన్ నంబర్‌ డయల్ తర్వాత ఈ ఆప్షన్లు ఎంచుకోవచ్చు :

  • మీ ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోతే మీరు యూపీఐ పేమెంట్ చేయొచ్చు.
  • మీ ఫోన్ యాప్‌కి వెళ్లి కీప్యాడ్ ఓపెన్ చేసి *99# డయల్ చేయండి.
  • ఆ తర్వాత మీ లాంగ్వేజీ ఎంచుకోవాలి.
  • హిందీ, ఇంగ్లీష్ సహా ఇతర భాషల నుంచి ఎంచుకోవచ్చు.
  • మీ బ్యాంక్ పేరు లేదా 4 అంకెల IFSC కోడ్‌ను ఎంటర్ చేయాలి.
  • మీ బ్యాంకును ఎంచుకోవాలి. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
  • చివరగా UPI పిన్ ఎంటర్ చేసి పేమెంట్ చేయండి.