జనం నెత్తిన గ్యాస్ బండ : మళ్లీ ధరలు పెరిగాయ్

  • Publish Date - October 2, 2019 / 03:24 AM IST

సామాన్యుడు, మధ్యతరగతి వారికి మరో షాక్ తగిలింది. వంట గ్యాస్ ధర పైకి ఎగబాకింది. ఇప్పటికే బ్యాంకుల ఛార్జీలు, నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమౌతున్నాడు. దీనికి తోడు వంట గ్యాస్ ధర పెరుగుతుడడంతో లబోదిబోమంటున్నాడు. ప్రతి నెలా ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయనే సంగతి తెలిసిందే. తాజాగా నాన్ సబ్సిడీ 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర స్వల్పంగా పెరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) తాజాగా గ్యాస్ సిలిండర్ ధరను రూ. 15 మేర పెంచింది. ధరలు పెరుగుతూ రావడం ఇది వరుసగా రెండో నెల. సెప్టెంబర్‌లో రూ. 16 పెరగగా..ఇప్పుడు మళ్లీ రూ. 15కి ఎగబాకింది. 

సౌదీ ఆరామ్‌కోపై డ్రోన్ దాడి తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెట్రోల్ రేట్లు కూడా రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. భారత దేశానికి చమురు సరఫరా తగ్గొచ్చనే అంచనాలు నెలకొంటున్నాయి. గ్యాస్ కంపెనీలు ప్రతి నెలా ఎల్‌పీజీ సిలిండర్ల రేట్లను సమీక్షిస్తూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్‌పీజీ రేట్లు, అమెరికా డాలర్ – ఇండియన్ రూపాయి మారకపు వంటి విలువ వంటి అంశాలు ప్రాతపదికన ధరను మారుస్తూ వస్తాయి. 

నగరం 1 అక్టోబర్ 2019 గతంలో తేడా
ఢిల్లీ రూ. 605 రూ. 590 రూ. 15
కోల్ కతా రూ. 630 రూ. 616.5 రూ. 13.5
ముంబై రూ. 574.5 రూ. 562 రూ. 12.5
చెన్నై రూ. 620 రూ. 606.5 రూ. 13.5

Read More : రైల్వే ప్రయాణీలకు ముఖ్య గమనిక : నారాయణాద్రి టైమింగ్