డబ్బుల వర్షం కురుస్తుందని బంగారంలో ఈ రూపంలో పెట్టుబడుల వరద.. వరల్డ్‌ గోల్డ్ కౌన్సిల్‌ ఏమందో తెలుసా? 

ఓ వైపు బంగారం ధరలు పెరుగుతున్నాయి.. మరోవైపు..

డబ్బుల వర్షం కురుస్తుందని బంగారంలో ఈ రూపంలో పెట్టుబడుల వరద.. వరల్డ్‌ గోల్డ్ కౌన్సిల్‌ ఏమందో తెలుసా? 

Gold

Updated On : March 9, 2025 / 4:12 PM IST

ప్రపంచ వ్యాప్తంగా గత నెల ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు)లో పెట్టుబడులు పెరిగాయని వరల్డ్ గోల్డ్‌ కౌన్సిల్ తెలిపింది. ఫిబ్రవరిలో ఆసియాలో పెట్టుబడిదారులు ఈటీఎఫ్‌లను అధిక మొత్తంలో కొనుగోలు చేశారు.

మొత్తం 2.3 బిలియన్ డాలర్లు (సుమారు 20 వేల కోట్లు) వీటిల్లో ఖర్చు చేశారు. ఇతర దేశాల్లోని పెట్టుబడిదారులలాగే ఆసియాలోనూ పెట్టుబడిదారులు వీటిపై అమితాసక్తి చూపుతున్నారు.

స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు తమ డబ్బును ఫిజికల్‌ గోల్డ్‌ను కొనడం కంటే బంగారు ఈటీఎఫ్‌లలో పెట్టడంపైనే ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు గతంతో పోల్చితే ఎన్నడూ లేనంతగా వస్తున్నాయి.

ఇండియా, చైనా, జపాన్‌లోనూ ఇంతే..
వరల్డ్ గోల్డ్‌ కౌన్సిల్ చెప్పిన వివరాల ప్రకారం.. భారతీయ పెట్టుబడిదారులు ఫిబ్రవరిలోనూ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులను కొనసాగించారు. అయితే, జనవరితో పోల్చి చూస్తే ఫిబ్రవరిలో మాత్రం కాస్త తగ్గాయి. ఫిబ్రవరిలో ఈటీఎఫ్‌లలో అత్యధిక పెట్టుబడులు పెట్టిన దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది.

చైనాలో స్టాక్ మార్కెట్‌ లాభాల్లో కొనసాగుతున్నప్పటికీ స్థానికంగా పెరుగుతున్న బంగారం ధరలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాయి. స్టాక్‌ మార్కెట్లు ముఖ్యంగా డీప్‌సీక్‌ ఏఐపై ఉన్న హైక్‌ వల్ల లాభాల బాటలో కొనసాగుతున్నాయి.

ఫిబ్రవరిలో బైడు (ప్రముఖ చైనీస్ సెర్చ్ ఇంజన్)లో బంగారం కోసం సెర్చ్‌ చేస్తున్న వారి సంఖ్య 2013 నుంచి ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా పెరిగిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. దీన్ని బట్టి బంగారం పట్ల చైనీయుల్లో ఆసక్తి ఎంతగా ఉందో చెప్పవచ్చని పేర్కొంది.

ఇక జపాన్‌ విషయానికి వస్తే.. ఆ దేశంలోనూ పెట్టుబడిదారులు వరుసగా ఐదు నెలల నుంచి ఈటీఎఫ్‌లలో భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఫిబ్రవరిలోనూ ఇది కొనసాగింది. బంగారం స్థిరమైన ఆస్తి కావడంతో జపాన్ పెట్టుబడిదారులు దీనిపై ఎంతగా ఆసక్తి చూపిస్తున్నారో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు.

వరుసగా మూడు నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా ఈటీఎఫ్‌లో చాలా మంది పెట్టుబడులు పెట్టారని వరల్డ్ గోల్డ్‌ కౌన్సిల్ తెలిపింది. ఓ వైపు బంగారం ధరలు పెరుగుతున్నాయి.. మరోవైపు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల విలువ కూడా 306 బిలియన్ డాలర్లకు పెరిగింది.