విమానానికి తప్పిన ముప్పు : 164మంది క్షేమం

  • Publish Date - December 23, 2019 / 12:11 PM IST

గో ఎయిర్ విమానానికి భారీ ఫ్రమాదం తప్పింది. టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక లోపం  తెలత్తటంతో పైలట్ విమానాన్ని గువహటిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బర్దోయి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. కాగా విమానంలోని 157 మంది  ప్రయాణికులు, 7గురు సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. సంస్ధలో సిబ్బంది కొరతతో సోమవారం 18  విమానాలను గో ఎయిర్ సంస్ధ రద్దు చేసింది. 

గోవహతి-కోల్‌కతా  గోఎయిర్ జి 8546  విమానం ఉదయం 11:15 గంటలకు గువహతి విమానాశ్రయం నుండి బయలుదేరింది. వెంటనే సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్‌ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఈ సందర్భంగా భారీ శబ్దం వినపడిందని  విమానాశ్రయంలోఉన్నవారు  చెప్పారు. లోహపు ముక్కలను కనుగొన్నామని స్థానికులు తెలిపారు. విమానం క్రాష్  అయినట్టుగా పెద్ద శబ్దం  వినగానే తాను షాక్  అయ్యానని స్థానికుడు ఒకరు తెలిపారు.