Logo
X

లేటెస్ట్

    10TV ఈవెంట్స్

      తెలంగాణ

        ఆంధ్రప్రదేశ్

          సినిమా, టీవీ & OTT

            క్రీడలు

              టెక్నాలజీ

                బిజినెస్

                  జాతీయం

                    అంతర్జాతీయం

                      ఫోటో గ్యాలరీ

                        వీడియోలు

                          10TV Telugu News
                          Trending
                          • #GaneshNimajjanam2025
                          • #GST
                          • #WeatherUpdates
                          • #GoldRate
                          • #GossipGarage
                          • #AsiaCup2025
                          • Telugu » Business » Gold And Silver Price On 11th April 2025 Check Latest Rates In Hyderabad Vijayawada Visakhapatnam Delhi Hn

                          Gold Price: ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి గోల్డ్ రేటు.. హైదరాబాద్, విజయవాడలో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇక్కడ తెలుసుకోండి..

                          తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.

                          • 10TV Digital Team
                          • Publish Date - April 11, 2025 / 11:18 AM IST

                          Gold

                          Gold And Silver Price: బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ నేపథ్యంలో గోల్డ్ రేటు భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో గడిచిన మూడు రోజుల్లో గతంలో ఎప్పుడు లేనంత స్థాయిలో ధరలు పెరిగాయి.. ఫలితంగా భారతదేశంలో గోల్డ్ రేటు సరికొత్త రికార్డులను నమోదు చేసింది.

                           

                          శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ. 2020 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 1,850 పెరిగింది. దీంతో బంగారం ధర 96వేల మార్క్ కు చేరుకొని సరికొత్త రికార్డులను నమోదు చేసింది. మరోవైపు గడిచిన మూడు రోజుల్లోనే 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.5,670 పెరుగుదల చోటు చేసుకుంది. మరోవైపు వెండి ధరకూడా పెరిగింది. ఇవాళ కిలో వెండి ధర రూ. వెయ్యి పెరగ్గా.. రెండు రోజుల్లో కిలో వెండిపై రూ.6వేలు పెరుగుదల చోటు చేసుకుంది.

                           

                          అంతర్జాతీయ మార్కెట్ లోనూ బంగారం ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఔన్సు (31.10గ్రాముల) బంగారం ధర అంతర్జాతీయ విపణిలో గురువారం 3,164డాలర్ల వద్ద కొనసాగగా.. శుక్రవారం ఉదయంకు 3,208 డాలర్లకు చేరింది. మరోవైపు ఔన్స్ సిల్వర్ ధర స్వల్పంగా పెరిగి 31.17 డాలర్ల వద్ద ట్రేడవుతుంది.

                           

                          తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
                          ♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
                          ♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.87,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.95,400కు చేరింది.
                          దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
                          ♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,600 కాగా.. 24 క్యారట్ల ధర రూ.95,550కు చేరింది.
                          ♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ. 87,450 కాగా.. 24క్యారెట్ల ధర రూ.95,400 గా నమోదైంది.

                           

                          వెండి ధర ఇలా..
                          ♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,08,000కు చేరింది.
                          ♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.97,100గా నమోదైంది.
                          ♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,08,000 కు చేరింది.

                          Note: పైన పేర్కొన్న ధరలు ఉదయం 10గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరలు రోజులో అనేక దఫాలుగా మారుతుంటాయి. ఖచ్చితమైన ధరల కోసం నగల దుకాణంలో లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి.

                           

                          Related News

                          • గెట్ రెడీ.. ఈ తేదీ నుంచే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్.. ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. బ్యాంకు ఆఫర్లు..!

                          • భారీగా తగ్గిన మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో.. అమెజాన్‌లో ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు..!

                          • దెబ్బకు పాకెట్ ఖాళీ.. వీటిపై 40 శాతం కాదు.. ఏకంగా 88శాతం వరకు జీఎస్టీ.. లిస్ట్ ఇదే

                          • బంధువులకు ఇచ్చిన రుణంపై పన్ను చెల్లించాలా? రూ. 20వేలకు మించి క్యాష్ లోన్ పేమెంట్స్ పై ITR ఫైల్ చేయాలా?

                          • బంగారానికే కాదు.. ఇక వెండికి కూడా హాల్‌మార్కింగ్‌.. స్వచ్ఛతను ఇలా గుర్తించవచ్చు..

                          • తెలుగు వార్తలు

                          • Latest
                          • Telangana
                          • Andhra Pradesh
                          • Movies
                          • National
                          • International
                          • Technology
                          • Education And Job
                          • Telugu News

                          • Trending
                          • Sports
                          • Crime
                          • Business
                          • Life Style
                          • Videos
                          • Photo Gallery
                          • Health
                          • Follow us

                          • Facebook
                          • instagram
                          • Regulatory Compliances
                          • About Us
                          • Advertise With Us
                          • Privacy & Cookies Notice
                          • Copyright © 2025 10TV. All rights reserved.
                          • Developed by Veegam Software Pvt Ltd.