Gold And Silver Price: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో 24క్యారట్ల 10గ్రాముల బంగారంపై సుమారు రూ.1800 పెరిగింది. అయితే, గురువారం బంగారం ధరలు శాంతించాయి. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధరలో ఎలాంటి పెరుగుదల చోటు చేసుకోలేదు. మరోవైపు.. వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.వెయ్యి పెరిగింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో గురువారం బంగారం ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,850కు చేరింది. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.79,470 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,200 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 79,620.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.72,850 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.79,470.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,850 కాగా.. 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ. 79,470 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా ..
దేశవ్యాప్తంగా గురువారం వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,04,000 కు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,04,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి ధర రూ. 96,500.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 96,500 వద్ద కొనసాగుతుంది.
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం నమోదైనవి. ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.