Gold
Gold rate in Hyderabad: అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలకు బ్రేక్ లు పడుతున్నాయి. వరుసగా మూడోరోజు బంగారం ధర భారీగా తగ్గింది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ పై రూ. 540 తగ్గగా.. 22క్యారట్ల బంగారంపై రూ. 500 తగ్గింది. మరోవైపు వెండి ధరసైతం భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది.
బంగారం ధరలు మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన మూడు రోజుల్లో 24క్యారట్ల 10గ్రాముల గోల్డ్ పై రూ. 1250 తగ్గింది. దీంతో ప్రస్తుతం 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ ధర రూ. 86,840కి పడిపోగా.. 22 క్యారట్ల గోల్డ్ రేటు రూ. 79,600 పడిపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర భారీగా తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.79,600కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ.86,840 వద్ద కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,750 కాగా.. 24 క్యారట్ల ధర రూ.86,990గా నమోదైంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 79,600 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.86,840 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,05,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండిపై రూ.3వేలు తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.97,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,05,000గా నమోదైంది.