దేశంలో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇవాళ ఉదయం బంగారం ధరలు రూ.600 తగ్గాయి. 5 రోజుల క్రితం వరకు పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఇప్పుడు వరసగా తగ్గుతూ వస్తుండడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పసిడి ధరలు ఇవాళ ఉదయం తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.600 తగ్గి రూ.82,250గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.650 తగ్గి రూ.89,730గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గి రూ.67,300గా ఉంది.
ఢిల్లీ, ముంబైలో..
ఢిల్లీలో బంగారం 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.82,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.650 తగ్గి రూ.89,880గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గి 67,420గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.600 తగ్గి రూ.82,250గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.650 తగ్గి రూ.89,730గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గి రూ.67,300గా ఉంది.
వెండి ధరలు
దేశంలో వెండి ధరల్లో ఇవాళ ఉదయం నాటికి ఎలాంటి మార్పులేదు. వివిధ నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
NOTE: పసిడి ధరల్లో గంటల వ్యవధిలో మార్పులు చోటుచేసుకుంటాయి. కస్టమర్లు బంగారం కొనే సమయం నాటికి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుని కొంటే మంచిది.