Gold
Gold and Silver Rate Today 11th October 2023: బంగారం కొనుగోలు దారులకు షాకిస్తూ మరోసారి ధరలు భారీగా పెరిగాయి. గత ఐదు రోజులుగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై సుమారు రూ. 1300 పెరుగుదల చోటు చేసుకుంది. తాజాగా బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ఓ కారణంగా తెలుస్తోంది. యుద్ధం కారణంగా అనిశ్చితితో అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర పెరిగింది. ఇరు దేశాల మధ్య వివాదం ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధర రెండు శాతం కంటే ఎక్కువ పెరిగింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇరు దేశాల మధ్య వివాదం మరింత ముదిరితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇదిలాఉంటే.. బుధవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా నమోదైన గోల్డ్ ధలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 300 పెరుగుదల చోటు చేసుకుంది. 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 330 మేర పెరిగింది.
gold
తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. బుధవారం ఉదయం 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 53,650కి చేరింది. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 58,530 వద్ద కొనసాగుతుంది.
Gold
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. బుధవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 58,680 కు చేరింది.
– చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 53,800 (రూ.150 పెరిగింది)కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,690 (రూ.160 పెరిగింది).
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 53,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,530 వద్ద కొనసాగుతుంది.
Gold
వెండి ధర ..
దేశ వ్యాప్తంగా వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 75,500 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 75,500 కాగా, ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలలో కిలో వెండి రూ.72,600 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి రూ. 70,500 గా ఉంది.