Gold Price Today : మహిళలకు అదిరిపోయే శుభవార్త.. వరుసగా మూడోరోజు భారీగా తగ్గిన బంగారం ధర..

తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో

Gold And Silver Price Today

Gold and Silver Price Today : బంగారం, వెండి కొనుగోలు దారులకు శుభవార్త. వరుసగా మూడోరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజాగా గోల్డ్ రేటు భారీగా తగ్గింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 24 క్యారట్ల 10గ్రాముల బంగారంపై రూ. 380 తగ్గింది. దీంతో గడిచిన మూడు రోజుల్లో 10గ్రాముల బంగారంపై రూ. వెయ్యికిపైగా తగ్గుదల చోటు చేసుకుంది. వచ్చేవారంసైతం గోల్డ్ ధరల్లో భారీ తగ్గుదల చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వెండిధర సైతం తగ్గింది. కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో మూడు రోజుల్లో కిలో వెండిపై రూ. 2,850 తగ్గింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,800 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,970.

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,950 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 74,120.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.67,800 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,970.
చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,400 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 74,620కు చేరింది.


వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా శనివారం వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 97, 650.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.97,650.
కోల్ కతాలో కిలో వెండి ధర రూ. 93,150 వద్ద కొనసాగుతుంది.
ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.93,150.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 91,650 వద్ద కొనసాగుతుంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

 

 

ట్రెండింగ్ వార్తలు