Gold Price Today
Gold and silver Price Today : శుభాకార్యాలైనా..పండుగలైనా బంగారం ధరలు పెరుగటం సర్వసాధరణంగ మారిపోయింది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా బంగారం పరుగులు పెడుతోంది. శుక్రవారం తో పోలిస్తే శనివారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. రోజు విధంగా ధర పెరుగుతోంది. దీంట్లో భాగంగా ఈరోజు అంటూ అక్టోబర్ 21న కూడా బంగరం ధర పెరిగింది. 10గ్రాములు 22 క్యారెట్ల బంగారం రూ.56,400గా నమోదైంది. 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారంలకు రూ.61,530కి చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 56,400 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 61,730 వద్ద కొనసాగుతుంది.
శనివారం భారత్ లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి.
-దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 61,690కు చేరింది.
-ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 56,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,530 వద్ద కొనసాగుతుంది.
దేశ వ్యాప్తంగా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. శుక్రవారం కిలో వెండి ధర 77,500గా అంటే అది శనివారం రూ.1200లు పెరిగి కిలో వెండి 78,700లకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 78,700గా ఉంది.