Gold Price Today : వామ్మో.. రాకెట్‌లా దూసుకెళ్తున్న బంగారం ధర.. 10రోజుల్లో ఎంత పెరిగిందో తెలుసా..? నేటి ధరలు ఇలా..
Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.

Gold Price Today
Gold Price Today : దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగుల వేళ బంగారం ధరలు (Gold Price Today) రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. తద్వారా ఆల్‌టైమ్ గరిష్టాలకు గోల్డ్ రేటు చేరుకుంటుంది. గడిచిన పది రోజులు 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై సుమారు రూ.6వేలు పెరిగింది.
బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.880 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.800 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఔన్సు గోల్డ్ పై 10డాలర్లు పెరిగింది.. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 3,537 డాలర్ల వద్ద కొనసాగుతుంది.
మరోవైపు.. వెండి ధరసైతం ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుంది. బుధవారం కిలో వెండిపై రూ. 900 పెరిగింది. దీంతో గడిచిన ఐదు రోజుల్లో కిలో వెండిపై సుమారు రూ. 7,500 పెరిగింది. బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న వేళ.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఓ సారి పరిశీలిద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.98,050 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,06,970కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,200 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,07,120కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.98,050 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,06,970కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,37,000కు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,27,000కు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,37,000కు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
Also Read: Bank Lockers Rules: మీ బ్యాంక్ లాకర్‌ను సస్పెండ్ చేయొచ్చు, సీల్ కూడా చేయొచ్చు..! ఆర్బీఐ కొత్త రూల్..