Amazon Great Indian Festival Sale 2025 : వావ్.. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు.. 10వేల కంటే ఎక్కువ ఆదా..!

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. త్వరలోనే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్ లోకి రానుందని ప్రకటించింది.

Amazon Great Indian Festival Sale 2025 : వావ్.. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు.. 10వేల కంటే ఎక్కువ ఆదా..!

Updated On : September 2, 2025 / 10:25 PM IST

Amazon Great Indian Festival Sale 2025 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 వచ్చేస్తోంది. ఈ సేల్ ఈవెంట్ త్వరలోనే ప్రారంభం కానుంది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, స్మార్ట్ హోమ్ అప్లయన్సస్, స్మార్ట్ టీవీలు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషీన్లు, ఫోన్ యాక్సెసరీస్ పై అదిరిపోయే ఆఫర్లు ఇవ్వనుంది. పలు ప్రొడక్ట్స్ పై భారీగా డిస్కౌంట్స్ ఉండనున్నాయి. Samsung Galaxy S24 Ultra కూడా ఈ సేల్ సమయంలో తగ్గింపు ధరకు అందుబాటులో ఉండనుంది.

ఈ సేల్ లో Samsung, iQOO, Apple, OnePlus, HP, Boat, Sony వంటి బ్రాండ్ల నుండి అనేక ఎలక్ట్రానిక్స్ వస్తువులు లిస్ట్ చేయబడతాయి. ఈ సేల్ ఈవెంట్ త్వరలో ప్రారంభమవుతుంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ గృహోపకరణాలు, స్మార్ట్ టీవీలు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషీన్లు, వైర్‌లెస్ స్టీరియోలు , ఫోన్ ఉపకరణాలను తక్కువ ధరకు అందిస్తోంది.

ల్యాప్ టాప్స్, శాంసంగ్ ఫోన్లపై భారీ డీల్స్..

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. త్వరలోనే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్ లోకి రానుందని ప్రకటించింది. సేల్ ఈవెంట్ కోసం మైక్రోసైట్ కూడా ప్రత్యక్ష ప్రసారమైంది. కొనుగోలుదారులు పొందగలిగే బ్యాంక్ ఆఫర్లు, డీల్స్ గురించి వెల్లడించింది. ఇప్పుడు ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌ఫోన్ల ధరలను టీజ్ చేస్తూ మైక్రోసైట్ అప్ డేట్ చేశారు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 సందర్భంగా బ్యాంక్ ఆఫర్లతో Nvidia GeForce RTX 3050 GPU కలిగిన Asus ల్యాప్‌టాప్ రూ. 60వేల కంటే తక్కువ ధరకు లభిస్తుంది. కస్టమర్లు ఇంటెల్ i5 13వ తరం ప్రాసెసర్‌తో HP 15ని రూ. 50వేల టే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

13 జెన్ ఇంటెల్ ప్రాసెసర్‌తో కూడిన డెల్ ఇన్‌స్పైరాన్ వంటి ఇతర ల్యాప్‌టాప్‌లు కూడా తక్కువ ధరకే అమ్ముడవుతాయి. ఆసుస్ వివోబుక్ సిరీస్ ల్యాప్‌టాప్‌లలో ఒకటి ఈ సేల్ ఈవెంట్ సమయంలో రూ. 80వేల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటుందని టీజ్ చేయబడింది. అలాగే ఇంటెల్ 13 జెన్ ప్రాసెసర్‌తో కూడిన లెనోవా ఐడియాప్యాడ్ మోడల్ కూడా రూ. 60వేల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 సందర్భంగా తగ్గింపు ధరకు అందుబాటులో ఉండే శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల లిస్ట్ ను కూడా కంపెనీ వెల్లడించింది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం Samsung Galaxy S24 Ultra, Galaxy M06 5G, Galaxy M16 5G, Galaxy A55 5G, Galaxy A56 5G, Galaxy A36 5G ఈ జాబితాలో ఉన్నాయి.

గత సంవత్సరం విడుదలైన Samsung Galaxy Z Fold 6 ను కూడా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. రాబోయే సేల్ ఈవెంట్ సమయంలో Samsung స్మార్ట్‌ఫోన్‌లపై కొనుగోలుదారులు రూ. 10వేల కంటే ఎక్కువ ఆదా చేసుకోగలరని కంపెనీ పేర్కొంది.

ఇంట్రస్ట్ ఫ్రీ EMI, ఎక్స్ ఛేంజ్ బోనస్ లు..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 లో కస్టమర్లకు వడ్డీ లేని EMI ఆప్షన్లు, ఎక్స్ ఛేంజ్ బోనస్‌లు కూడా లభిస్తాయి. శామ్‌సంగ్‌తో పాటు, ఈ-కామర్స్ కంపెనీ కొనుగోలుదారులకు ఆపిల్, ఐక్యూఓ, వన్‌ప్లస్ వంటి బ్రాండ్‌ల నుండి స్మార్ట్‌ఫోన్లు, వాటి యాక్సెసరీస్ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇవి అమెజాన్‌లో 40 శాతం వరకు డిస్కౌంట్ తో లభిస్తాయి. SBI డెబిట్, క్రెడిట్ కార్డ్ హోల్డర్లు 10 శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందగలరు. SBI క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలకు కూడా ఇది వర్తిస్తుంది.

ఇంకా అలెక్సా, ఫైర్ టీవీ, కిండిల్ ఈ-రీడర్లు వంటి అమెజాన్-బ్రాండెడ్ స్మార్ట్ హోమ్ ఎకో పరికరాలు 50 శాతం వరకు తగ్గింపుతో లభిస్తాయి. రాబోయే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 కచ్చితమైన ప్రారంభ తేదీ, వ్యవధిని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే, కస్టమర్లు తమ క్రెడిట్ డెబిట్ కార్డ్ వివరాలను సేవ్ చేసుకోవాలని, ఆన్‌లైన్ లావాదేవీల కోసం బ్యాంక్ కార్డులను యాక్టివేట్ చేసుకోవాలని, అలాగే వేగవంతమైన చెక్అవుట్ కోసం వారి డెలివరీ అడ్రస్ లను సేవ్ లేదా అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.

Also Read: రూ.15 వేలలోపే కెవ్వుకేక పెట్టించే 5జీ స్మార్ట్‌ఫోన్లు.. అబ్బబ్బ ఏమున్నాయ్ భయ్యా..