రూ.15 వేలలోపే కెవ్వుకేక పెట్టించే 5జీ స్మార్ట్‌ఫోన్లు.. అబ్బబ్బ ఏమున్నాయ్ భయ్యా..

బ్యాక్‌సైడ్ 32 ఎంపీ ప్రధాన కెమెరా, ఫ్రంట్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది, 15-వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

రూ.15 వేలలోపే కెవ్వుకేక పెట్టించే 5జీ స్మార్ట్‌ఫోన్లు.. అబ్బబ్బ ఏమున్నాయ్ భయ్యా..

Realme Narzo 80 Lite 5G

Updated On : September 2, 2025 / 9:45 PM IST

Realme Narzo 80 Lite 5G: మీరు 15 వేలలోపు ధరతో మంచి 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? రియల్‌మీ ఫోన్లు అంటే మీకు ఇష్టమా? అయితే, రియల్‌మీ నార్జో 80 లైట్ 5జీ ఫోన్, రియల్‌మీ నార్జో 80x ఫోన్‌ ఫీచర్ల గురించి తెలుసుకోవాల్సిందే. ఈ రెండు ఫోన్లు శక్తిమంతమైన ప్రాసెసర్‌లతో వచ్చాయి. వీటిని ఫ్లిప్‌కార్ట్ లైవ్ సేల్‌లో తక్కువ ధరకు కొనవచ్చు.

రియల్‌మీ నార్జో 80 లైట్ 5జీ ఫీచర్లు

రియల్‌మీ నార్జో 80 లైట్ 5జీ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.67-అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడి డిస్ప్లేతో వచ్చింది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. రియల్ యూజ్‌లో గరిష్ఠ 625 నిట్స్ బ్రైట్‌నెస్ అందుతుంది.

బ్యాక్‌సైడ్ 32 ఎంపీ ప్రధాన కెమెరా, ఫ్రంట్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది, 15-వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

ఈ ఫోన్‌కి ఐపీ64 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఈ ఫోన్‌కి శక్తినిస్తుంది.

Also Read: “నిరాశపడకు, ఏమీ చేసుకోకు.. పూరి గుడిసెలోనైనా బతుకుదాం” అని నా భార్య అంది: మరోసారి “బార్బరిక్” దర్శకుడు కన్నీరు.. ఫుల్‌ ఇంటర్వ్యూ

రియల్‌మీ నార్జో 80x ఫోన్ ఫీచర్లు

మరోవైపు, రియల్‌మీ నార్జో 80x ఫోన్ 6.72-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఐపిఎస్ ఎల్సీడి డిస్ప్లేతో వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. గరిష్ఠ 950 నిట్స్ బ్రైట్‌నెస్ అందుతుంది. దీంతో నేరుగా సూర్యరశ్మిలో కూడా వాడవచ్చు.

ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ ఉంది. బ్యాక్‌సైడ్ 50 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ పోర్ట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్, 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఐపీ69 వాటర్‌ప్రూఫ్, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉన్నాయి.

ధరలు ఇలా

రియల్‌మీ నార్జో 80 లైట్ 5జీ ధర రూ.10,999 నుంచి మొదలవుతుంది (6 జీబి ర్యామ్, 128 జీబి స్టోరేజ్). రియల్‌మీ నార్జో 80x ధర రూ. 12,999 నుంచి మొదలవుతుంది (6 జీబి ర్యామ్, 128 జీబి స్టోరేజ్). బెస్ట్‌ పర్ఫార్మన్స్‌, మంచి డిస్ప్లే, మెరుగైన కెమెరా సెటప్, వేగవంతమైన చార్జింగ్ కావాలంటే రియల్‌మీ నార్జో 80x బాగుంటుంది. మీ బడ్జెట్ తక్కువైతే రియల్‌మీ నార్జో 80 లైట్ 5జీ సరిపోతుంది.