“నిరాశపడకు, ఏమీ చేసుకోకు.. పూరి గుడిసెలోనైనా బతుకుదాం” అని నా భార్య అంది: మరోసారి “బార్బరిక్” దర్శకుడు కన్నీరు.. ఫుల్ ఇంటర్వ్యూ
"నేను ఎక్కడ ఇంటికి వచ్చేసి, ఫ్యాన్ కి ఉరేసుకుంటానేమోనని భయంగా ఆవిడ వచ్చేసింది. నేను ఏమంటున్నాను అంటే.. నేను వాళ్లని భయపెట్టేస్తున్నాను. సినిమా తీసి భయపెట్టేశాను" అని అన్నారు.

Director Mohan Srivatsa
Director Mohan Srivatsa: సత్యరాజ్, ఉదయభాను ప్రధానపాత్రల్లో నటించిన “త్రిభాణధారి బార్బరిక్” సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు.
అయితే, ఈ సినిమా చూసిన వారు మూవీ బాగుందని అంటున్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం థియేటర్‌లోకి రావడం లేదని మోహన్ శ్రీవత్స కన్నీరు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై 10టీవీతో ఆయన మాట్లాడారు.
“నా సినిమాను అందరూ బాగుందని అంటున్నారు. చూసినవాళ్లు బాగుందని అంటున్నారు. జనాలు ఎందుకు రావట్లేదు? అని అనుకున్నాను. ఈ సినిమాను థియేటర్‌లో చూశాక, అక్కడి నుంచి కిందకెళ్లి మా వైఫ్ కి కాల్ చేశాను. నేను ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పాను. నువ్వు సినిమా పూర్తిగా చూసి రా అన్నాను. వాళ్లు వేరే థియేటర్ కి వెళ్లారు. నేను ఇంటికి వెళ్లేసరికి లిఫ్ట్ లో మా ఆవిడ ఉంది. నేను ఇంటికి వచ్చేసరికి ఆమె వచ్చేసింది.
కళ్లల్లో నీళ్లు తుడుచుకుని తాళం తీసి లోపలికి వెళ్లి గట్టిగా పట్టేసుకుంది. అంటే తనలో భయం ఉంది. నేను నా సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను కదా. నేను ఫ్యామిలీకి ఏం చేయలేదు.. ఫ్యామిలీని ఇలా భయపెట్టేశాను.. అన్న ఒక్క భయం నన్ను వెంటాడింది. నేను ఎక్కడ ఇంటికి వచ్చేసి, ఏ ఫ్యాన్ కి ఉరేసుకుంటానేమో అని భయంగా ఆవిడ వచ్చేసింది.
ఏడ్చేసి, మనం పూరి గుడిసెలోనైనా బతుకుదాం. ఏం అవసరం లేదు అంది. నేను ఏమంటున్నాను అంటే.. నేను వాళ్లని భయపెట్టేస్తున్నాను. సినిమా తీసి భయపెట్టేశాను. వాళ్లని సినిమా తీసి భయపెట్టేశానన్న ఆ భయం ఉంది. నా దగ్గర టాలెంట్స్ చాలా ఉన్నాయి. నేను బ్యూటిఫుల్ గా పాటలు పాడతాను. పియానో నేర్పిస్తాను. నాకు ఆ టాలెంట్ కూడా ఉంది. నాకు సస్టైన్ అవ్వడానికో, బతకడానికో ఇవన్నీ ఉన్నాయి” అని చెప్పారు.