Home » Business » Gold And Silver Price Today On 23rd February 2024 In Hyderabad Vijayawada Visakhapatnam Delhi
Gold Price Today : బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ..
Gold And Silver Price : బంగారం కొనుగోలు దారులకు గుడ్ న్యూస్.. శుక్రవారం దేశంలోని పలు ప్రాంతాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గోల్డ్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారం రోజుల క్రితం తులం బంగారం ధర రూ. 57,000 కాగా.. ప్రస్తుతం రూ. 57,500కు చేరింది. వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,500 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,730 కు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,650 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 62,880.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో .. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,500 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 62,730.
చెన్నైలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,950 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.63,220 గా నమోదైంది.
స్థిరంగా వెండి ధర ..
దేశవ్యాప్తంగా వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 76,500 గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ. 76,000కాగా.. ముంబయి, ఢిల్లీ, కోల్కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.74,500కు చేరింది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,500 వద్ద కొనసాగుతుంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.