మళ్లీ మొదలైన బంగారం దూకుడు..! ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ...

Gold And Silver Price Today : బంగారం కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. వరుసగా రెండోరోజు భారీగా పెరిగింది. గత వారం రోజులుగా కాస్త నెమ్మదించిన బంగారం ధరలు.. బుధ, గురువారాల్లో భారీగా పెరిగాయి. బుధవారం పది గ్రాముల బంగారంపై రూ. 220 పెరగ్గా.. గురువారం ఉదయం రూ. 380 పెరిగింది. దీంతో రెండు రోజుల్లోనే తులం బంగారంపై రూ. 600 పెరుగుదల చోటు చేసుకుంది. ప్రస్తుతం బంగారం ధర దూకుడు చూస్తుంటే కొద్దిరోజుల్లోనే తులం గోల్డ్ ధర రూ. 70వేలకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వెండి ధరసైతం పెరిగింది. రెండురోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి ధర.. బుధవారం కిలో వెండిపై రూ. 300 పెరిగింది.

 

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,700 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,310 మార్క్ కు చేరింది.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 67,460.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 61,700 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 67,310.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.62,500 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.68,180 మార్క్ కు చేరింది.

 

  • పెరిగిన వెండి ధర ..
    దేశం వ్యాప్తంగా వెండి ధర పెరిగింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.80,500కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 80,500. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.77,500 కు చేరింది. బెంగళూరులో కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ.75,900 వద్ద కొనసాగుతుంది.

 

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు