Gold Rate : మళ్లీ లక్ష దాటిన వెండి ధర.. అదేబాటలో బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ..

Gold And Silver Price

Gold And Silver Price Today : బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా వారం రోజులు తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు సోమవారం మళ్లీ పెరగ్గా.. మంగళవారం సైతం బంగారం ధరలో పెరుగుదల చోటు చేసుకుంది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 220 పెరిగింది. మరోవైపు వెండి ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఇటీవల లక్షదాటిన కిలో వెండి ధర.. వారం రోజులుగా కాస్త శాంతించింది. కానీ, వెండి ధర మళ్లీ భారీగా పెరిగింది. మంగళవారం ఉదయం కిలో వెండిపై రూ. 3,500 పెరిగింది. దీంతో మరోసారి రూ. లక్ష దాటింది.

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,930.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,000 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,080.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.66,850 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,930.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,400 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.73,530.

  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా వెండి ధర భారీగా పెరిగింది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.
    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,01,000.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ.1,01,000.
    కోల్ కతా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.96,500.
    బెంగళూరులో వెండి ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. దీంతో అక్కడ ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 93,250 వద్ద కొనసాగుతుంది.

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు