iQOO Smartphone Deals : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు.. ఐక్యూ స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే డీల్స్.. ఏ ఫోన్ ధర ఎంతంటే?

Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఐక్యూ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. ఈ డీల్స్ ఎలా పొందాలంటే?

iQOO Smartphone Deals : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు.. ఐక్యూ స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే డీల్స్.. ఏ ఫోన్ ధర ఎంతంటే?

iQOO Smartphone Deals (Image Credit To Original Source)

Updated On : January 12, 2026 / 2:27 PM IST
  • జనవరి 16 నుంచి ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్
  • నవంబర్ 2025లో లాంచ్ అయిన ఐక్యూ 15 ఫోన్
  • అమెజాన్ సేల్ సమయంలో ఐక్యూ నియో 10 ధర రూ. 33,999

Amazon Great Republic Day Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. జనవరి 16 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌లు, స్పీకర్లు, స్మార్ట్ టీవీలు, హోం అప్లియన్సెస్ మరిన్నింటితో సహా వైడ్ రేంజ్ ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. రాబోయే సేల్ కోసం అనేక డీల్స్ ముందుగానే రివీల్ చేసింది. ఈ అమెజాన్ సేల్ సమయంలో ఐక్యూ ఇండియా కొన్ని ఫోన్ల తగ్గింపు ధరలను ప్రకటించింది.

ఐక్యూ స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు :
ఐక్యూ కంపెనీ కూడా ఆన్-సేల్ ధరలను ప్రకటించింది. ఈ లిస్టులో ఐక్యూ 15 సేల్ ఆఫర్ టాప్. గత నవంబర్‌లో లాంచ్ అయిన ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ 144 రిఫ్రెష్ రేట్‌తో 6.85-అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌, 7000mAh బ్యాటరీతో వస్తుంది.

iQOO Smartphone Deals

iQOO Smartphone Deals (Image Credit To Original Source)

ఐక్యూ 15 ప్రారంభ ధర రూ. 72,999కి లాంచ్ అయింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ రూ. 65,999కి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. బ్యాంక్ కార్డులతో అనేక ఆఫర్లు ఉన్నాయి. కొనుగోలుదారులు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.

Read Also : IRCTC Ticket Booking : రైల్వే ప్రయాణికులకు పండగే.. ఇకపై అర్ధరాత్రి వరకు రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే?

ఈ సేల్ సమయంలో ఐక్యూ నియో 10 ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. 2025 మేలో లాంచ్ అయిన ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 SoC, 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ షూటర్‌ అందిస్తుంది. ఈ ఐక్యూ ఫోన్ 120W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌, 7000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.

ఈ సేల్ సమయంలో ఐక్యూ నియో 10 రూ. 33,999 ప్రారంభ ధరకు లభ్యమవుతోంది. ఐక్యూ నియో 10R ఫోన్ ధర రూ. 24,999, ఐక్యూ Z10 ధర రూ. 20,499 ఉండగా, అమెజాన్ సేల్ సమయంలో ఐక్యూ Z10R ఆన్ సేల్ ధర రూ. 18,499కు లభిస్తోంది. బడ్జెట్ కేటగిరీలో ఐక్యూ z10x ధర రూ. 13,499కు, ఐక్యూ Z10 లైట్ ధర రూ. 9,999కు లభిస్తోంది.