IRCTC Ticket Booking : రైల్వే ప్రయాణికులకు పండగే.. ఇకపై అర్ధరాత్రి వరకు రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే?

IRCTC Ticket Booking : రైల్వే బోర్డు ప్రకారం.. రిజర్వేషన్ సిస్టమ్ దుర్వినియోగం కాకుండా ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చింది.. పూర్తి వివరాలివే..

IRCTC Ticket Booking : రైల్వే ప్రయాణికులకు పండగే.. ఇకపై అర్ధరాత్రి వరకు రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే?

IRCTC Ticket Booking (Image Credit To Original Source)

Updated On : January 12, 2026 / 12:57 PM IST
  • ఆధార్ వెరిఫైడ్ IRCTC యూజర్లకు ఈ కొత్త రూల్ వర్తిస్తుంది
  • జనవరి 12 నుంచి అడ్వాన్స్ రిజర్వేషన్ టైమ్ కొత్త నిబంధన అమల్లోకి
  • రిజర్వేషన్ సిస్టమ్ దుర్వినియోగాన్ని నిరోధించడమే లక్ష్యం

IRCTC Ticket Booking : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జనవరి 12 (సోమవారం) నుంచి రైలు టికెట్ బుకింగ్ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేశాయి. రైలు జనరల్ రిజర్వ్ టికెట్ బుకింగ్ టైమ్ పొడిగించింది రైల్వే శాఖ.

ఈ కొత్త రూల్ ప్రకారం.. రైల్వే ప్రయాణికుల్లో ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే ముందుగా ట్రైన్ టికెట్ బుకింగ్ చేసుకోగలరు. ఆధార్ వెరిఫైడ్ ఐఆర్‌సీటీసీ యూజర్లు ఇకపై అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) ప్రారంభమయ్యే రోజు అర్ధరాత్రి వరకు రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

PRS కౌంటర్లలో టిక్కెట్లు బుకింగ్ ఎలా? :
కొత్త నిబంధన ప్రకారం.. ఈ నెల 12 నుంచి ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్ చేసుకోగలరు. అయితే, కంప్యూటరైజ్డ్ PRS కౌంటర్లలో టిక్కెట్లు బుక్ చేసుకునే విధానంలో ఎలాంటి మార్పు ఉండదు.

IRCTC Ticket Booking

IRCTC Ticket Booking

ఇ-టికెటింగ్ సిస్టమ్ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు రైల్వే శాఖ రిజర్వ్ టికెట్ల బుకింగ్ విషయంలో నిబంధనలను మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగానే అడ్వాన్స్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

రైల్వే టికెట్ బుకింగ్ టైమ్ పొడిగింపు :

జనరల్ రిజర్వేషన్ల కోసం ఆధార్ వెరిఫైడ్ బుకింగ్ సమయాన్ని రైల్వే బోర్డు దశలవారీగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు, ఆధార్ వెరిఫైడ్ యూజర్లు బుకింగ్ విండో ఓపెన్ చేసిన రోజున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే రిజర్వ్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

Read Also : Motorola Edge 50 Pro 5G : అద్భుతమైన 50MP సెల్ఫీ కెమెరాతో ఈ మోటోరోలా 5G ఫోన్ జస్ట్ రూ. 24,999కే.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

గతంలో, జనరల్ రిజర్వేషన్లు ప్రారంభమైన మొదటి 15 నిమిషాలలో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా రిజర్వ్ టిక్కెట్ బుకింగ్ కోసం ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉండేది. ఆ తర్వాత ఆధార్ రిజర్వ్ టికెట్ బుకింగ్ మొదటి రోజు ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు పొడిగించారు.

డిసెంబర్ 29న ఆధార్ వెరిఫైడ్ ఐఆర్‌సీటీసీ యూజర్లకు టికెట్ రిజర్వేషన్ కోసం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య అనుమతించారు. కానీ, జనవరి 5న రిజర్వేషన్ టికెట్ బుకింగ్ విండోను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పొడిగించారు.

అయితే, ఈ నెల 11 వరకు ఆధార్ వెరిఫైడ్ యూజర్లు బుకింగ్ విండో మొదలైన రోజున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే రిజర్వ్ టిక్కెట్లను బుక్ చేసుకోగలిగారు. జనవరి 12 నుంచి మాత్రం అర్ధరాత్రి వరకు రిజర్వ్ టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.