Gold Price: దేశవ్యాప్తంగా మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్, విజయవాడలో తులం గోల్డ్ రేటు ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ..
- Harishth Thanniru
- Published On : November 30, 2024 / 11:05 AM IST
Gold Rate
Gold And Silver Price: దేశవ్యాప్తంగా బంగారం ధర మరోసారి స్వల్పంగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 110 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 100 తగ్గింది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500కు చేరింది. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.78,000 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,650 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 78,150.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.71,500 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.78,000.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 71,500 కాగా.. 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ. 78,00 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా ..
దేశవ్యాప్తంగా శనివారం వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,00,000.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,00,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రేటు రూ. 91,500.
బెంగళూరులో కిలో వెండి ధర 91,500 వద్ద కొనసాగుతుంది.
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం నమోదైనవి. ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
